ఐ ఫోన్‌ 7పై భారీ తగ్గింపు | Great Indian Festival: Amazon offers iPhone 7 for Rs 38,000 | Sakshi
Sakshi News home page

Oct 14 2017 12:18 PM | Updated on Jul 6 2019 3:18 PM

 Great Indian Festival: Amazon offers iPhone 7 for Rs 38,000 - Sakshi

 సాక్షి, న్యూఢిల్లీ: ఇ-కామర్స్ సైట్  అమెజాన్ దీపావళి అమ్మకాలకు మరోసారి తెర తీసింది.  దీపావళి సందర్భంగా గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్ అమ్మకాలను  తిరిగి  ప్రారంభించింది.   ఈ సందర్భంగా ఐ ఫోన్‌పై భారీ తగ్గింపును అందిస్తోంది.   ఈ స్మార్ట్‌ఫోన్‌ ధరపై  రూ. 11వేల కోతపెట్టి అమేజింగ్‌ ఆఫర్‌తో వినియోగదారులను ఆకర్షిస్తోంది. అక్టోబరు 14 శనివారం నుంచి ప్రారంభమైన  గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్   సేల్‌ అక్టోబర్ 17 న ముగియనుంది.

సుమారు రూ. 60వేల విలువచేసే ఐఫోన్ 7 32జీబీ డివైస్‌ను    రూ. 37,999 అమెజాన్ లో అందుబాటులో ఉంది.   నో కాస్ట్‌ ఈఎంఐ సదుపాయం ద్వారా కూడా ఉంది.  రూ.1,807 నుంచి మొదలవుతుంది. అంతేకాదు  రూ. 9,500 వరకు  ఎక్సేంజ్‌ ఆఫర్  కూడా అందిస్తోంది.   

ఎస్‌బీఐ  క్రెడిట్‌, డెబిట్‌ కార్డ్స్‌  ద్వారా కొనుగోలు చేస్తే 10 శాతం క్యాష్‌ బ్యాంక్‌,  అమెజాన్‌ పే ద్వారా అయితే రూ. 500  క్యాష్‌ బ్యాక్‌  సదుపాయాన్ని అందిస్తోంది. అయితే, ఈ ఆఫర్లు ఎంపిక చేసుకున్న స్మార్ట్‌ఫోన్‌ బ్రాండ్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

సెప్టెంబరులో బంగారం, నలుపు రంగుల ఆప్లన్లలో ఐ ఫోన్‌ 7ను  రూ .38,999కే విక్రయించింది.  మరోవైపు జీఎస్‌టీ అనంతరం  ఐఫోన్ 7 ధర రూ.60 వేల నుంచి రూ .56,200 కి తగ్గింది. అయితే అమెజాన్‌ ద్వారా ఇండియాలో   దీని ధర రూ.49,990 గా ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement