రూ.1 కే హానర్ 9ఎన్

సాక్షి, న్యూఢిల్లీ: చైనా దిగ్గజం హానర్ స్మార్ట్‌ఫోన్ ప్రేమికులకు బంపర్ ఆఫర్ ఇస్తోంది. హానర్ భారతీయ వినియోగదారులకోసం ఫ్లాష్ సేల్ ని నిర్వహిస్తోంది. సెప్టెంబర్ 11న ఈ ప్రత్యేకంగా ఈ విక్రయాన్ని చేపట్టబోతోంది. ఈ సేల్‌లో హానర్ 9ఎన్ (3 జీబీ, 32 జీబీ స్టోరేజ్) స్మార్ట్‌ఫోన్‌ను కేవలం ఒక రూపాయికే అందించనుంది. హానర్ 9ఎన్ 3 జీబీ, 32 జీబీ స్టోరేజ్ వేరియంట్ అసలు ధర. రూ. 11,999గా ఉంది.
సెప్టెంబర్ 11 న ఉదయం 11 గంటల 45 నిమిషాలకు హానర్ వెబ్‌సైట్ ద్వారా ఈ ఫ్లాష్ సేల్ నిర్వహిస్తుంది. అయితే ఇది కేవలం కంపెనీ వెబ్‌సైట్ అలాగే స్టోర్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. లిమిటెడ్ డివైస్‌లపై అందిస్తున్న ఈ ఆఫర్‌ను దక్కించుకోవాలంటే హానర్ ఆన్‌లైన్ స్టోర్‌లో రిజిస్టర్ చేసుకొని వ్యకిగత వివరాలను నమోదు చేయాలి. అలాగే ఆన్‌లైన్ చెల్లింపులకు మాత్రమే అనుమతి. దీంతోపాటు ఈ ఫ్లాష్ సేల్ ద్వారా హానర్ 7ఎస్, హానర్ 9ఎన్, హానర్ ప్లే ఫోన్లపై ఆకట్టుకునే ఆఫర్లు, ఇతర డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి