భారత్ లో అత్యంత ప్రభావిత బ్రాండ్ గూగుల్ | Google is the most influential brand in India | Sakshi
Sakshi News home page

భారత్ లో అత్యంత ప్రభావిత బ్రాండ్ గూగుల్

Apr 23 2016 12:17 AM | Updated on Sep 3 2017 10:31 PM

భారత్ లో అత్యంత ప్రభావిత బ్రాండ్ గూగుల్

భారత్ లో అత్యంత ప్రభావిత బ్రాండ్ గూగుల్

దేశంలో అత్యంత ప్రభావితమైన బ్రాండ్‌గా గూగుల్ అవతరించింది. టాప్-10 ప్రభావిత బ్రాండ్ల జాబితాలో ఇది అగ్రస్థానాన్ని కైవసం

విదేశీ బ్రాండ్లదే హవా.. చిట్టచివరిలో దేశీ బ్రాండ్లు..
న్యూఢిల్లీ: దేశంలో అత్యంత ప్రభావితమైన బ్రాండ్‌గా గూగుల్ అవతరించింది. టాప్-10 ప్రభావిత బ్రాండ్ల జాబితాలో ఇది అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. గ్లోబల్ మార్కెట్ రీసెర్చ్ కంపెనీ ఇప్సో (ఐపీఎస్‌ఓఎస్) నివేదిక ప్రకా రం.. గూగుల్ తర్వాతి స్థానాల్లో ఫేస్‌బుక్, జి-మెయిల్, మైక్రోసాఫ్ట్, శాంసంగ్, వాట్స్‌యాప్‌లు ఉన్నాయి. ఇవ్వన్నీ కూడా విదేశీ బ్రాండ్లే. అంటే టాప్-6లో ఏ ఒక్క దేశీ బ్రాండ్ కూడా స్థానం పొందలేదు. జాబితాలో స్థానం పొందిన దేశీ బ్రాండ్లలో ఫ్లిప్‌కార్ట్ టాప్‌లో ఉంది. ఇది ఏడవ స్థానంలో నిలిచింది. అమెరికాకు చెందిన అమెజాన్  8వ స్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో ఎస్‌బీఐ (9వ స్థానం), ఎయిర్‌టెల్ (10వ స్థానం) ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement