భారీగా పడిపోయిన బంగారం ధరలు | Gold Slumps Rs 365 On Weak Global Cues, Muted Demand | Sakshi
Sakshi News home page

భారీగా పడిపోయిన బంగారం ధరలు

Aug 2 2018 3:19 PM | Updated on Aug 2 2018 4:47 PM

Gold Slumps Rs 365 On Weak Global Cues, Muted Demand - Sakshi

బంగారం ధరలు (ఫైల్‌ ఫోటో)

స్థానిక జువెల్లర్స్‌ నుంచి డిమాండ్‌ క్షీణించడం, గ్లోబల్‌గా సంకేతాలు బలహీనంగా వస్తుండటంతో బులియన్‌ మార్కెట్‌లో బంగారం ధరలు క్షీణించాయి.

న్యూఢిల్లీ : బంగారం ధరలు నేడు భారీగా పడిపోయాయి. బులియన్‌ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర 365 రూపాయలు పడిపోయి 30,435 రూపాయల వద్ద నమోదైంది. స్థానిక జువెల్లర్స్‌ నుంచి డిమాండ్‌ క్షీణించడం, గ్లోబల్‌గా ఈ విలువైన మెటల్‌కు సంకేతాలు బలహీనంగా వస్తుండటంతో బులియన్‌ మార్కెట్‌లో ధరలు క్షీణించినట్టు బులియన్‌ ట్రేడర్లు చెప్పారు. బంగారంతో పాటు వెండి ధరలూ స్వల్పంగా తగ్గాయి. 

పారిశ్రామిక యూనిట్లు, కాయిన్‌ తయారీదారుల నుంచి వెండికి డిమాండ్‌ కాస్త తగ్గడంతో, కేజీ వెండి ధర 50 రూపాయలు తగ్గి రూ.40 వేల కింద రూ.39 వేలుగా రికార్డైంది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీ రేట్లు పెంచకుండా యథాతథంగా ఉంచడంతో డాలర్‌ బలపడింది. దీంతో ఈ విలువైన మెటల్‌కు గ్లోబల్‌గా డిమాండ్‌ తగ్గింది. గ్లోబల్‌గా గోల్డ్‌ 0.65 శాతం పడిపోయి, ఔన్స్‌కు 1,215.50 డాలర్లుగా నమోదైంది. బలహీనమైన గ్లోబల్‌ ట్రెండ్‌తో పాటు, దేశీయంగా ఆభరణ వర్తకుల నుంచి డిమాండ్‌ తగ్గిపోయింది. దీంతో దేశ రాజధాని ఢిల్లీలో 99.9 శాతం, 99.5 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధరలు 365 రూపాయల చొప్పున పడిపోయి రూ.30,435, రూ.30,285గా నమోదయ్యాయి. కాగ, నిన్న ఈ విలువైన మెటల్‌ ధర 150 రూపాయలు పెరిగిన సంగతి తెలిసిందే.  

Advertisement
 
Advertisement
Advertisement