బంగారం దిగుమతి సుంకం పెంపు | Gold import duty increase | Sakshi
Sakshi News home page

బంగారం దిగుమతి సుంకం పెంపు

Aug 13 2013 5:46 PM | Updated on Sep 1 2017 9:49 PM

బంగారం

బంగారం

కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచింది.

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచింది. ఇప్పటి వరకు  ఉన్న సుంకం 8 శాతంను  10 శాతానికి పెంచింది. వెండిపై కూడా దిగుమతి సుంకాన్ని పెంచింది. వెండిపై 6 శాతం నుంచి 10 శాతానికి పెంచింది. రెండేళ్లలో బంగారంపై సుంకంను 2 నుంచి 10 శాతానికి పెంచారు. బంగారం వాడకం తగ్గించడంతోపాటు రూపాయి పతనానికి అడ్డుకట్ట వేసే చర్యలలో భాగంగా ప్రభుత్వం దిగుమతి సుంకం పెంచింది.

 సుంకం పెంపు వార్తతో  పసిడి ధర భారీగా పెరిగింది. ప్రస్తుతం ఎంసిఎక్స్లో  10 గ్రాముల బంగారం ధర 28,963 రూపాయలు ఉంది. కేజీ వెండి ధర 46,480 రూపాయలకు చేరింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement