మందగించిన జీడీపీ వృద్ధి రేటు

GDP growth falls to 6.6 Per cent in Q3, Slowest in Five Quarters - Sakshi

గత అయిదు క్వార్టర్లలో ఇదే అతి నెమ్మదైన వృద్ధి

మూడో త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 6.6 శాతం -సీఎస్‌ఓ

సాక్షి, న్యూఢిల్లీ:  భారత స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు బాగా మందగించింది. సెంబర్ 2018తో ముగిసిన మూడో త్రైమాసికంలో జీడీపీవృద్ధి రేటు 6.6 శాతంగా నమోదైంది. గత అయిదు   త్రైమాసికాల్లో  అంటే  సెప్టెంబర్ 2017తో ముగిసిన క్వార్టర్ తర్వాత ఇదే అత్యంత నెమ్మదైన జీడీపీ వృద్ధి.

అక్టోబర్-డిసెంబర్ మాసానికి సంబంధించిన జీడీపీ వృద్ధి గణాంకాలను జాతీయ గణాంక కార్యాలయం (సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ సీఎస్ఓ) గురువారం ప్రకటించింది.  ఈ ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉండొచ్చని గత నెల సీఎస్ఓ ముందుగా అంచనా వేసింది.  గత ఏడాది ఇది 7 శాతంగా ఉంది. రాయిటర్స్‌ సర్వేలో 55 మంది ఆర్థిక నిపుణులు వృద్ధిరేటు 6.9 శాతంగా ఉంటుందని అంచనావేశారు. ఈ అంచనాలను తలకిందులు చేస్తూ తక్కువ వృద్ధి రేటును నమోదు చేయడం గమనార్హం.

2018-19 ఆర్థిక సంవత్సరంలో స్థిర (2011-12) ధరల దగ్గర వాస్తవ జీడీపీ రూ.141.00 లక్ష కోట్ల స్థాయికి చేరనుందని అంచనా. జనవరి 31, 2019న ప్రకటించిన వివరాల ప్రకారం 2017-18 ఆర్థిక సంవత్సరానికి అంతకుముందు సవరించిన జీడీపీ అంచనా రూ.131.80 లక్షల కోట్లుగా ఉంది. 2018-19 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7 శాతం ఉంటుందని అంచనా. 2017-18లో జీడీపీ వృద్ధి రేటు 7.2 శాతంగా ఉందని సీఎస్ఓ పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top