రూపాయి రయ్‌ రయ్‌  

Forex reserves drop by $24.02 billion to $400.52 billion in April-September   - Sakshi

27 పైసలు లాభంతో 69.58కి రికవరీ  

ముంబై: డాలర్‌ మారకంలో రూపాయి విలువ రికవరీ కొనసాగుతోంది. శుక్రవారం ఇంటర్‌ బ్యాంక్‌ ఫారెక్స్‌ మార్కెట్‌లో ఒకేరోజు 27 పైసలు లాభపడి 69.58 వద్ద ముగిసింది. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు గరిష్టం నుంచి దాదాపు 30 డాలర్లు పతనం కావడం రూపాయి వేగవంతమైన రికవరీకి దారితీస్తోంది.

దీంతోపాటు దేశంలోకి తాజా విదేశీ మూలధన నిధుల రాక కూడా రూపాయి సెంటిమెంట్‌ను బలపరుస్తోంది. సెప్టెంబర్, అక్టోబర్‌ నెలల్లో 5 బిలియన్‌ డాలర్లు వెనక్కు తీసుకున్న విదేశీ ఇన్వెస్టర్లు, నవంబర్‌లో భారత్‌ ఈక్విటీల్లో 558 మిలియన్‌ డాలర్ల తాజా పెట్టుబడులు పెట్టారు. అక్టోబర్‌ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అటు తర్వాత వేగంగా కోలుకుంటూ వచ్చింది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top