
ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘ఫోర్డ్ ఇండియా’ తన హ్యాచ్‌బ్యాక్ కారు ‘ఫిగో’లో నూతన ఎడిషన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. పెట్రోల్, డీజిల్ వేరియంట్లలో ఈకారు విడుదల కాగా, ధరల శ్రేణి రూ.5.15 లక్షలు నుంచి రూ.8.09 లక్షలుగా కంపెనీ ప్రకటించింది.
1.2 లీటర్లు, 1.5 లీటర్ల ఇంజిన్ సామర్థ్యంతో విడుదలైన నూతన ఫిగోలో.. టాప్ ఎండ్ మోడల్ సెన్సింగ్ వైపర్స్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్, ఎలెక్ట్రోక్రోమిక్ మిర్రర్ లాంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంది. 1,200లకు మించిన నూతన భాగాలు, సమగ్ర పునఃరూపకల్పన, మెరుగైన భద్రతా సాంకేతికత, నూతన ఇంజిన్ ఈ ఏడాది ఎడిషన్ ప్రత్యేకతలుగా తెలిపింది.