మడతపెట్టే డైనింగ్‌ టేబుల్‌

Folding dining table - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: డైనింగ్‌ టేబుల్‌ ఆకారం, నాణ్యతలో కాలానుగుణంగా అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. సౌకర్యంతో పాటూ ఇంటి అందాన్ని రెట్టింపు చేసే డైనింగ్‌ టేబుల్‌ డిజైన్స్‌కు వినియోగదారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. దీంతో డిజైనర్లు ఆ తరహా టేబుల్స్‌ను రూపొందిస్తున్నారు. బాదంకాయ ఆకారంలో, వృత్తాకారంలో, దీర్ఘచతురస్రాకారంలో టేబుల్స్‌ను డిజైన్‌ చేస్తున్నారు. ప్రీమియం రకం డైనింగ్‌ టేబుల్స్‌ అయితే అవసరమైనప్పుడు డైనింగ్‌ టేబుల్‌లా వాడుకొని మిగిలిన సందర్భంలో మడతపెట్టి పక్కన పెట్టే విధంగా రూపొందిస్తున్నారు. మరికొన్ని రకాల టేబుల్స్‌ కింద పాత్రలు, ప్లేట్స్‌ పెట్టుకునే విధంగా అరలు కూడా ఉంటున్నాయి. ఎవరి కుటుంబ అవసరాలకు, అభిరుచులకు తగ్గట్టుగా వివిధ రకాల డైనింగ్‌ టేబుల్స్‌ మార్కెట్లో లభ్యమవుతున్నాయి.

►ఓపెన్‌ కిచెన్‌ ఉన్నప్పుడు హాల్‌లోనే ఒక పక్కన డైనింగ్‌ టేబుల్‌ ఏర్పాటు చేసుకోవచ్చు. హాల్‌ సైజ్‌కు అనుగుణంగా టేబుల్‌ సైజ్‌ ఉండేలా చూసుకుంటే మంచిది. 
► టేబుల్‌ మరీ పెద్దగా ఉండటం వల్ల హాల్‌ లేదా వంటగది చిన్నగా లేదా ఇరుగ్గా కనిపిస్తుంది.  
►పిల్లలు ఉన్న ఇంట్లో గ్లాస్‌ డైనింగ్‌ టేబుల్‌కు బదులుగా స్టోన్‌ ఫినిష్‌ ఉన్న టేబుల్‌ను లేదా ఉడెన్‌ టేబుల్‌ను ఎంచుకోవటం మంచిది.  
►కిచెన్‌లో ఏమాత్రం అవకాశం ఉన్నా ఇద్దరు లేదా ఒక్కరు కూర్చొని తినేందుకు వీలుగా ఉండే పోర్టబుల్‌ బ్రేక్‌ఫాస్ట్‌ టేబుల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. 
►గ్లాస్‌ డైనింగ్‌ టేబుల్‌ ఉంటే.. దానికి ఉపయోగించిన వుడ్‌ మెటీరియల్స్‌ గోడల రంగులకు మ్యాచ్‌ అయ్యేలా చూసుకుంటే ఇంటి అందం రెట్టింపు అవుతుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top