మారుతి విక్రయాలకు వరదల దెబ్బ

Floods, heavy rains pull Maruti sales down 3.6percent  in August - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ఆటో దిగ్గజం మారుతి సుజుకి ఇండియా (ఎంఎస్ఐఎల్) విక్రయాలను వర్షాలు, వరదల దెబ్బబాగా  తాకింది.  ఆగస్టునెలలో మారుతి  వాహనాల విక్రయాలు  భారీ క్షీణతను నమోదు చేసింది.  3.6 శాతం క్షీణతతో  మారుతి విక్రయాలు  1,45,895 యూనిట్లకు చేరాయి.  గత ఏడాది ఇదే నెలలో 1,51,270 యూనిట్లు విక్రయించింది. కేరళలో తీవ్ర వరదలు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో భారీ వర్షాల వల్ల నెలవారీ అమ్మకాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎగుమతులు కూడ 10శాతం క్షీణించి 10,489 యూనిట్లుగా నమోదయ్యాయి. గత ఏడాది ఇదే  నెలలో 11,701 యూనిట్లను ఎగుమతి చేసింది.

గత నెలలో  కాంపాక్ట్‌ సెగ్మెంట్‌లో 71,364 యూనిట్లు విక్రయించింది. అంటే  సెలేరియో, స్విఫ్ట్, బాలెనో, డిజైర్ వంటి కంపెనీల అమ్మకాలు 3.6 శాతం తగ్గాయి. గత ఏడాది ఇదే కాలంలో 74,102 యూనిట్లు విక్రయించింది.యుటిలిటీ వాహనాలు ఎస్-క్రాస్, విటారా బ్రెజ్జా అమ్మకాలు 16 శాతం తగ్గాయి. గత ఏడాది ఆగస్టులో 21,442 యూనిట్లతో  పోలిస్తే 17,971 యూనిట్లపే మాత్రమే  విక్రయించింది. అయితే  మిని సెగ్మెంట్‌ అల్టో, వాగన్‌ ఆర్‌ విక్రయాలను పాజిటివ్‌గా ఉన్నాయి.  గత ఏడాది 35,428 యూనిట్ల తో పోలిస్తే ఈ ఏడాది 35,895 యూనిట్లు విక్రయించామని కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది. కాగా మిడ్‌ రేంజ్‌  సెడాన్ సియాజ్ అమ్మకాలు కూడా 8 శాతం పెరిగి 7,002 యూనిట్లకు చేరాయి. మొత్తంగా  ఆగస్టు నెలలో దేశీయ మార్కెట్లో మారుతి సుజుకీ ఇండియా 2.8 శాతం క్షీనించి 1,47,700 వాహనాలను సేల్‌ చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే నెలలో ఈ సంఖ్య 1,52,000 యూనిట్లు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top