రూ.649కే రెడ్‌మి నోట్‌ 5 ప్రొ!!

Flipkart Is Selling The Xiaomi Redmi Note 5 Pro For As Low As Rs 649 - Sakshi

బెంగళూరు : దేశీయ ఈ-కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌, బిగ్‌ షాపింగ్‌ డేస్‌ ప్రమోషనల్‌ సేల్‌ ఈవెంట్‌కు తెరలేపిన సంగతి తెలిసిందే. నిన్నటి నుంచి ఈ బిగ్‌ షాపింగ్‌ డేస్‌ నిర్వహిస్తోంది. అమెజాన్‌ ప్రైమ్‌ డేకు పోటీగా నిర్వహిస్తున్న ఈ సేల్‌, జూలై 19తో ముగుస్తోంది. ఈ నేపథ్యంలో షావోమి రెడ్‌మి నోట్‌ 5 ప్రొ స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్‌ అత్యంత తక్కువగా రూ.649కే అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫోన్‌ను కొనుగోలు చేద్దామని ఎప్పడి నుంచో ఆశగా ఎదురుచూస్తున్న షావోమి ఫ్యాన్స్‌కు ఇది నిజంగా గుడ్‌న్యూస్‌. అంతేకాక తగినంత స్టాక్‌ను కూడా అందుబాటులో ఉంచింది.

అసలు రెడ్‌మి నోట్‌ 5 ప్రొ బేస్‌ 4 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ వెర్షన్‌ ధర రూ.14,999 కాగ, టాప్‌ ఎండ్‌ వెర్షన్‌ 6 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజ్‌ ధర 16,999 రూపాయలు. ఈ రెండు వెర్షన్లు ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. బిగ్‌షాపింగ్‌ డేస్‌ ప్రమోషనల్‌ సేల్‌ ఈవెంట్‌ సందర్భంగా బేస్‌ వెర్షన్‌ను రూ.649కు, టాప్‌-ఎండ్‌ వెర్షన్‌ను రూ.2,649కు ఫ్లిప్‌కార్ట్‌ అందుబాటులోకి తెచ్చింది. 

ఈ భారీ డిస్కౌంట్‌ను పొందడానికి కస్టమర్లు రెండు రకాల ప్రక్రియలను అనుసరించాల్సి ఉంటుంది. ఒకటి మరో స్మార్ట్‌ఫోన్‌ ఎక్స్చేంజ్‌లో దీన్ని కొనుగోలు చేయడం, మరొకటి ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు కలిగి ఉండటం. ఎక్స్చేంజ్‌పై 12,850 రూపాయల వరకు తగ్గింపును ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్‌ చేస్తుండగా.. ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డులపై 10 శాతం ఇన్‌స్టాంట్‌ డిస్కౌంట్‌ను ఇస్తోంది. ఈ గరిష్ట డిస్కౌంట్‌ను పొందడానికి కొనుగోలుదారులు ఈ రెండు ప్రమాణాలను కలిగి ఉండాలి. మీరు ఎక్స్చేంజ్‌ చేసే స్మార్ట్‌ఫోన్‌ రూ.12,850 డిస్కౌంట్‌కు అర్హత కలిగి ఉండి, ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డు కలిగి ఉంటే చాలు రూ.649కు రెడ్‌మి నోట్‌ 5 ప్రొ మీకు లభ్యమైనట్టే. 

అయితే ఐఫోన్‌ 6ఎస్‌ను, లేటెస్ట్‌ గూగుల్‌ పిక్సెల్‌ 2ను, షావోమి ఎంఐ 5ను ఎక్స్చేంజ్‌ చేయడానికి వీలులేదు. కేవలం వన్‌ప్లస్‌ 5టీ ఎక్స్చేంజీని చేసుకోవచ్చు. దీని ఎక్స్చేంజ్‌తో రూ.12,850 డిస్కౌంట్‌ లభిస్తోంది. ఒకవేళ రెడ్‌మి నోట్‌ 4 ఎక్స్చేంజ్‌లో దీన్ని కొంటే రూ.3600 తగ్గింపు వస్తోంది. దాంతో పాటు ఎస్‌బీఐ క్రెడిట్‌ కార్డును కలిగి ఉంటే, అదనంగా మరో రూ.1500 తగ్గుతోంది. దీంతో రెడ్‌మి నోట్‌ 5 ప్రొ ధర రూ.14,999 నుంచి రూ.9,899కు తగ్గిపోతుంది. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top