గతం గతః.. మరో కొత్త అధ్యాయం

Flipkart billionaire Binny Bansal breaks his silence after Walmart ouster - Sakshi

మౌనం వీడిన  ఫ్లిప్‌కార్ట్‌ మాజీ సీఈవో బిన్నీ బన్సల్‌

ఎక్స్‌ టూ 10ఎ​క్స్‌ టెక్నాలజీ  పేరుతో కంపెనీ

10వేలమంది  మధ్యతరగతి వ్యాపారులకు సాయం

సాక్షి,  బెంగళూరు : ఈ కామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌  వ్యవస్థాపకులలో ఒకడైన బిన్నీ బన్సల్‌ (37) ఎట్టకేలకు  మౌనం వీడారు.  లైంగిక వేధింపుల ఆరోపణలతో ఫ్లిప్‌కార్ట్‌ సీఈవోగా వైదొలగిన  మూడు నెలల అనంతరం తొలిసారిగా ఆయన తన భవిష్యత్‌ కార్యాచరణ ప్రణాళికను  ప్రకటించారు. గతం గతః..ఇక ముందుకే..తన జీవితంలో మరో  అధ్యాయనాన్ని ప్రారంభించనున్నట్టు ఒక ఇంటర్‌వ్యూలో  చెప్పారు.   

తన పాత సహచరుడు  సాయి కిరణ్‌ కృష్టమూర్తితో  కలిసి స్థాపించిన ఎక్స్‌ టూ 10 ఎ​క్స్‌ టెక్నాలజీ అనే స్టార్టప్‌పై దృష్టిపెట్టనున్నట్టు వెల్లడించారు.  తద్వారా 10 స్టార్టప్‌ కంపెనీలకు ఊతమివ్వాలని నిర్ణయించామంటూ తన  ఫ్యూచర్‌ ప్లాన్లను  ప్రకటించారు. నిజానికి వీటి ద్వారా సుమారు 10 వేలకుపైగా  మధ్యతరగతి వ్యాపారవేత్తలకు సాయం  చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటికే  బృందంతోపాటు ఒక  కార్యాలయాన్నికూడా ఏర్పాటు  చేసుకున్నారు. అంతేకాదు కొంతమంది  ప్రముఖ స్టార్టప్‌ వినియోగదారులను కూడా తన ఖాతాలో వేసుకున్నారు. 

కాగా  గ్లోబల్‌ ఈ కామర్స్‌ దిగ్గజం వాల్‌మార్ట్‌ 1600 కోట్ల డాలర్లు చెల్లించి ఫ్లిప్‌కార్ట్‌ను టేకోవర్ చే సిన సంగతి తెలిసిందే.  ఈ కొనుగోలు అనంతరం ఫ్లిప్‌కార్ట్‌ ఫౌండర్లు ఒకరుసచిన్‌ బన్స్‌ల్‌ తన వాటాను మొత్తం విక్రయించు సంస్థను వీడగా, లైంగిక  వేధింపుల ఆరోపణలతో బిన్నీ బన్సల్‌ ఫ్లిప్‌కార్ట్‌ సీఈవో పదవిగా రాజీనామా చేశారు. బన్సల్‌పై 'తీవ్ర వ్యక్తిగత దుష్ప్రవర్తన' ఆరోపణలపై  ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలూ లభించనప్పటికీ నిర్ణయాలు తీసుకోవడంలో లోపాలు, వివిధ సందర్భాలకు తగినట్లు స్పందించకపోవడం, పారదర్శకత లేమి బయటపడ్డాయని, అందుకే ఆయన రాజీనామాను  ఆమోదించామని ఫ్లిప్‌కార్ట్, వాల్‌మార్ట్‌లు ఒక సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి.  4శాతం వాటాను కలిగి వున్నబిన్సీ బన్సల్‌ ఫ్లిప్‌కార్డ్ బోర్డులో  ఇంకా కొనసాగుతున్నారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top