రేపటి ఎంఐ3 అమ్మకాలకు ఫ్లిఫ్ కార్ట్ రెడీ
ఆన్ లైన్ బిజినెస్ లో ఫ్లిప్ కార్ట్, సియోమిల మంగళవారం మానియా ఊపందుకుంది.
ఆన్ లైన్ బిజినెస్ లో ఫ్లిప్ కార్ట్, సియోమిల మంగళవారం మానియా ఊపందుకుంది. ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ లో రేపు రెండవ దఫా ఎంఐ 3 మోబైల్ ఫోన్ అమ్మకాలు మధ్యాహ్నం రెండు గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ వారం 20 వేల ఫోన్లను అమ్మకానికి పెట్టడానికి ఫ్లిప్ కార్ట్ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే 75 వేల మోబైల్ ఫోన్ల కొనుగోలుకు రిజిస్ట్రేషన్లు జరిగాయని ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. అంతేకాకుండా బుధవారం అర్ధరాత్రి వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవడానికి అవకాశం కల్పించామని ఫ్లిప్ కార్ట్ తెలిపింది.
ఎంఐ 3 మోభైల్ ఫోన్ కొనడానికి పెద్ద ఎత్తున్న వినియోగదారుల నుంచి స్పందన లభించింది. ఓ దశలో ఎక్కువ మోతాదులో వినియోగదారులు ఎంఐ 3 ఫోన్ కొనుగోళ్లకు ఆర్డర్ చేయడంతో ఫ్లిప్ కార్ట్ వెబ్ సైట్ సేవలు స్తంభించిపోయాయి. తొలి దఫాలో 40 నిమిషాలకే స్టాక్ అమ్మకాలు పూర్తయ్యాయని, రెండవ బ్యాచ్ లో ఐదు సెకన్లు, మూడవ బ్యాచ్ లో రెండు సెకన్లలోనే అమ్మకాలు పూర్తయ్యాయన్నారు.
నెక్సస్ 5, గెలాక్సీ ఎస్ 4, ఎక్స్ పిరియా జెడ్ మొబైల్ పోన్లకు ధీటుగా సేవలందిస్తూ వినియోగదారుల్ని విశేషంగా ఆకర్షిస్తున్న ఎంఐ3 ఫోన్ ధర 13999.