
ఒక్కరోజులో ఐదు కల్యాణ్ షోరూమ్‌లు ప్రారంభం
కల్యాణ్ జ్యూయలర్స్ సంస్థ కేరళలో ఒక్కరోజులోనే ఐదు జ్యూయలరీ షోరూమ్‌లను ప్రారంభించింది.
హైదరాబాద్: కల్యాణ్ జ్యూయలర్స్ సంస్థ కేరళలో ఒక్కరోజులోనే ఐదు జ్యూయలరీ షోరూమ్‌లను ప్రారంభించింది. ఒక్క రోజులో ఐదు షోరూమ్స్‌ను ప్రారంభించడం ఆభరణాల పరిశ్రమలో ఇదే మొదటిసారని కల్యాణ్ జ్యూయలర్స్ ఒక ప్రకటనలో తెలిపింది. అత్తింగల్, అదూర్, తొడుప్పుజ, అలప్పుజ, అంగమలై నగరాల్లో ఈ షోరూమ్స్‌ను ఏర్పాటు చేశామని కల్యాణ్ జ్యూయలర్స్ సీఎండీ టి. ఎస్. కల్యాణ్‌రామన్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో తమ బ్రాండ్ అంబాసిడర్లు ఐశ్వర్య రాయ్, ప్రభు గణేశన్, మంజు వారియర్‌లు పాల్గొన్నారని వివరించారు.