ఫైనాన్స్‌ షేర్ల క్షీణత మార్కెట్‌ను మరింత ముంచింది..!

Financial stocks with more worries lead markets lower  - Sakshi

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ అన్ని టర్మ్‌ లోన్‌ చెల్లింపులపై మారిటోరియాన్ని ఆగస్ట్‌ 31వరకు పొడిగించడంతో శుక్రవారం బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ కంపెన షేర్లు భారీ పతనాన్ని చవిచూశాయి. రుణగ్రహీతల నుండి రుణాల తిరిగి పొందడానికి ఎక్కువ కాలం వేచి ఉండటంతో బ్యాంకుల లాభదాయకతను దెబ్బతీస్తుందని విశ్లేషకులు తెలిపారు.

ఎన్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 2.6శాతం నష్టంతో 17,279 వద్ద, నిప్టీ ప్రైవేట్‌ బ్యాంక్‌ ఇండెక్స్‌ 3శాతం నష్టంతో 9,421 ముగిశాయి. అయితే ఎన్‌ఎస్‌ఈ పీఎస్‌యూ బ్యాంక్‌ ఇండెక్స్‌ 0.10శాతం స్వల్ప నష్టంతో 1090 పాయింట్లు వద్ద స్థిరపడింది. 

ఇప్పటికే కోవిద్‌ లాక్‌డౌన్‌తో ఇప్పటికే బ్యాంకులు ఒత్తిడిలో ఉన్నాయి. అలాగే ఆస్తుల నాణ్యత విషయంలో చాలా సమస్యలను ఎదుర్కోంటున్నాయి. ఇప్పుడు ఆర్‌బీఐ మారిటోరియం పొడగింపు ప్రతికూలంగా మారనుంది. అయితే, రెపోరేటు తగ్గింపు క్రెడిట్ వృద్ధికి సానుకూలంగా ఉంటుంది. ఈ తాత్కాలిక నిషేధం ప్రతికూలంగా ఉంటుంది. ఎన్‌బీఎఫ్‌సీలు, బ్యాంకుల ఖర్చులను తగ్గిస్తుంది. అని షేర్‌ఖాన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ లలితాబ్ శ్రీవాస్తవ తెలిపారు.

శుక్రవారం మార్కెట్‌ ముగింపు సరికే యాక్సిస్‌ బ్యాంక్‌ 5.50శాతం, ఫెడరల్‌ బ్యాంక్‌, ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, బంధన్‌ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్లు 2శాతం నుంచి 4శాతం నష్టంతో ముగిశాయి. దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్‌ ఎస్‌బీఐ షేర్లు అరశాతం నష్టంతో రూ.151 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top