నియామకాల్లో భారత కంపెనీల దూకుడు! | Fair hiring climate for Victoria in new year, ManpowerGroup survey | Sakshi
Sakshi News home page

నియామకాల్లో భారత కంపెనీల దూకుడు!

Dec 13 2017 1:04 AM | Updated on Dec 13 2017 1:04 AM

Fair hiring climate for Victoria in new year, ManpowerGroup survey - Sakshi

న్యూఢిల్లీ: భారత కంపెనీలు ఉద్యోగ నియామకాల విషయంలో ఎంతో ఆశావాదంతో ఉన్నాయి. ఈ విషయంలో అంతర్జాతీయంగా మన దేశం మూడో స్థానంలో ఉన్నట్టు కన్సల్టెన్సీ సంస్థ మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ ఇండియా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 22 శాతం కంపెనీలు రానున్న మూడు నెలల్లో మరింత మంది ఉద్యోగులను తీసుకోనున్నట్టు వెల్లడైంది.

ఈ విషయంలో అంతర్జాతీయంగా తైవాన్‌ మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 4,500 కంపెనీల అభిప్రాయాలను ఈ సంస్థ సర్వేలో భాగంగా తెలుసుకుంది.  జపాన్‌ 24 శాతంతో రెండో స్థానంలో ఉండగా, 22 శాతం ఆశావహంతో భారత్‌ మూడో స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా మ్యాన్‌పవర్‌ గ్రూపు 43 దేశాల్లో 59,000 కంపెనీలను ఇంటర్వ్యూ చేసింది.

Advertisement
 
Advertisement
Advertisement