breaking news
Man Power Group
-
నియామకాల్లో భారత కంపెనీల దూకుడు!
న్యూఢిల్లీ: భారత కంపెనీలు ఉద్యోగ నియామకాల విషయంలో ఎంతో ఆశావాదంతో ఉన్నాయి. ఈ విషయంలో అంతర్జాతీయంగా మన దేశం మూడో స్థానంలో ఉన్నట్టు కన్సల్టెన్సీ సంస్థ మ్యాన్‌పవర్ గ్రూప్ ఇండియా నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. 22 శాతం కంపెనీలు రానున్న మూడు నెలల్లో మరింత మంది ఉద్యోగులను తీసుకోనున్నట్టు వెల్లడైంది. ఈ విషయంలో అంతర్జాతీయంగా తైవాన్ మొదటి స్థానంలో నిలిచింది. దేశవ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన 4,500 కంపెనీల అభిప్రాయాలను ఈ సంస్థ సర్వేలో భాగంగా తెలుసుకుంది. జపాన్ 24 శాతంతో రెండో స్థానంలో ఉండగా, 22 శాతం ఆశావహంతో భారత్ మూడో స్థానంలో ఉంది. అంతర్జాతీయంగా మ్యాన్‌పవర్ గ్రూపు 43 దేశాల్లో 59,000 కంపెనీలను ఇంటర్వ్యూ చేసింది. -
ఉందిలే ‘కొలువుల’ కాలం...
⇒కొత్త ఏడాదిలో 3-5 లక్షల కొత్త ఉద్యోగాలు ⇒వేతనాలూ బాగానే పెరుగుతాయి ⇒వివిధ హెచ్ఆర్ సంస్థల అంచనాలు న్యూఢిల్లీ: కొత్త ఏడాదిలో కొత్త కొలువులు కళకళలాడనున్నాయి. అంతేకాకుండా ఉద్యోగుల వేతనాలను కూడా భారత కంపెనీలు సముచిత రీతిలో పెంచనున్నాయి. 2015 సంవత్సరంలో 3-5 లక్షల కొత్త ఉద్యోగాలు రానున్నాయని వివిధ మానవ వనరుల (హెచ్ఆర్) సంస్థలు, జాబ్ కన్సల్టెన్సీ సంస్థలు అంచనాలు వేస్తున్నాయి. ఏఆన్ హెవిట్, హే గ్రూప్, మెర్సర్ వంటి అంతర్జాతీయ సంస్థలు టీమ్‌లీజ్ సర్వీసెస్, మ్యాన్‌పవర్ గ్రూప్, స్టాఫింగ్ ఫెడరేషన్ వంటి ప్రముఖ సంస్థలు వెల్లడించిన వివరాల ప్రకారం... ⇒భారత కంపెనీలు వచ్చే ఏడాది తమ సిబ్బంది సంఖ్యను 15-20 శాతం వరకూ పెంచుకోనున్నాయి. ఈ ఏడాది ఇది 10-12% స్థాయిలో ఉంది. ⇒వచ్చే ఏడాది వేతనాలు సగటున 10-12% పెరగనున్నాయి. ఈ ఏడాది వేతనాల పెరుగుదల 8-10 శాతం రేంజ్లో ఉంది. ప్రతిభ గల ఉద్యోగులకు కొన్ని రంగాల్లో రెండంకెల వేతన వృద్ధిని(30 శాతం వరకూ కూడా) కంపెనీలు ఆఫర్ చేయనున్నాయి. ⇒కేంద్రంలో సుస్థిరమైన కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో బిజినెస్ సెంటిమెంట్ మెరుగుపడింది. దీంతో కొలువుల విషయంలో ఈ ఏడాది కంటే వచ్చే ఏడాది బాగా ఉండబోతోంది. ⇒ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. సానుకూలమైన బిజినెస్ సెంటిమెంట్ కొనసాగుతోంది. ⇒మరిన్ని రంగాల్లో విదేశీ పెట్టుబడులకు తలుపులు తెరుస్తామన్న వాగ్దానాన్ని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిలుపుకుంటే పలు విదేశీ సంస్థలు భారత్‌లో కార్యకలాపాలు ప్రారంభిస్తాయి. దీంతో మరిన్ని ఉద్యోగావకాశాలు దక్కుతాయి. ⇒ఐటీ, ఆరోగ్య సంరక్షణ, ఫార్మా, తయారీ, ఇంజనీరింగ్, రిటైల్ రంగాల్లో అధిక సంఖ్యలో కొత్త కొలువులు రానున్నాయి. టెలికం, ఎఫ్ఎంసీజీ, ఆర్థిక సేవలు తదితర రంగాల్లో చెప్పుకోదగ్గ సంఖ్యలో కొత్త ఉద్యోగాలొస్తాయి. ⇒ప్రతిభ గల ఉద్యోగులు తమను వదలిపోకుండా కంపెనీలు వివిధ ప్రయత్నాలు చేస్తున్నాయి. వేతనాలు పెంచడమే కాకుండా, వైద్య, ఆర్థిక ప్రోత్సాహాకాలు ఇవ్వనున్నాయి. ⇒ప్రతిభ గల ఉద్యోగులను తయారు చేసుకోవడానికి వివిధ కాలేజీ భాగస్వామ్యంతో కంపెనీలు టాలెంట్ పూల్‌ను ఏర్పాటు చేస్తున్నాయి.