ఫేస్‌బుక్‌ నుంచి వీడియోకాలింగ్‌ పరికరం ‘పోర్టల్‌‘

Facebook Portal video chat screens raise privacy concerns - Sakshi

ధర 199–349 డాలర్లు

లండన్‌: సోషల్‌ నెట్‌వర్కింగ్‌ సైట్‌ ఫేస్‌బుక్‌ కొత్తగా ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ) ఆధారంగా పనిచేసే వీడియో కాలింగ్‌ పరికరం ‘పోర్టల్‌‘ను ఆవిష్కరించింది. 10 అంగుళాల స్క్రీన్‌ కలిగిన పోర్టల్‌ రేటు 199 డాలర్లుగాను, 15 అంగుళాల వెర్షన్‌ ధర 349 డాలర్లుగాను ఉంటుంది. స్మార్ట్‌ స్పీకర్‌ మార్కెట్లో అమెజాన్, గూగుల్‌తో పోటీపడే క్రమంలో ఫేస్‌బుక్‌ దీన్ని రూపొందించింది. ప్రత్యేకంగా స్క్రీన్‌ ముందరే నిల్చోవాల్సిన అవసరం లేకుండా ’హేయ్‌ పోర్టల్‌’ అని పలకరించడం ద్వారా దీన్నుంచి కాల్‌ ప్రక్రియ ప్రారంభించవచ్చు.

కాల్‌ చేస్తుండగా మధ్యలో కావాలనుకుంటే కెమెరా ఆటోమేటిక్‌గా జూమ్‌ అవుట్‌ అయి మనతో పాటు మరో వ్యక్తిని కూడా వీడియో కాల్‌లో చూపిస్తుం ది. అలాగే కాలర్‌ అటూ, ఇటూ తిరుగుతూ మాట్లాడుతున్నా వారినే ఫాలో అవడం, వారి మాటల్ని మాత్రమే గుర్తించడం తదితర ఫీచర్స్‌ ఇందులో ఉన్నాయి. పోర్టల్‌తో వ్యక్తిగత ప్రైవసీ, భద్రతకు ముప్పేమీ ఉండబోదని ఫేస్‌బుక్‌ స్పష్టం చేసింది. కెమెరాను కవర్‌ చేసేయొచ్చని, లెన్స్‌.. మైక్రోఫోన్‌ను డిజేబుల్‌ కూడా చేయొచ్చ ని వివరించింది. ముందుగా అమెరికా మార్కె ట్లో ప్రీ–ఆర్డర్‌లు తీసుకుంటున్నట్లు పేర్కొంది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top