ఈ-కామర్స్‌లోకి ఫేస్‌బుక్..! | Facebook moves into e-commerce, acquires TheFind | Sakshi
Sakshi News home page

ఈ-కామర్స్‌లోకి ఫేస్‌బుక్..!

Mar 17 2015 1:50 AM | Updated on Sep 2 2018 4:03 PM

ఈ-కామర్స్‌లోకి ఫేస్‌బుక్..! - Sakshi

ఈ-కామర్స్‌లోకి ఫేస్‌బుక్..!

సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్.. ఇక ఈ-కామర్స్ రంగంలోనూ తన సత్తా చాటనుంది.

షాపింగ్ సెర్చ్ ఇంజిన్ ‘ద ఫైండ్’ కొనుగోలు
హ్యూస్టన్: సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్.. ఇక ఈ-కామర్స్ రంగంలోనూ తన సత్తా చాటనుంది. దీనిలో భాగంగానే షాపింగ్ సెర్చ్ ఇంజిన్ ‘ద ఫైండ్’ను చేజిక్కించుకుంది. అయితే, ఇందుకు ఎంత మొత్తాన్ని వెచ్చించిందో ఫేస్‌బుక్ వెల్లడించలేదు. ఇంటర్నెట్ వ్యాపార మార్కెట్లో అతికీలకమైన సెర్చ్.. ఈ-కామర్స్ రంగాల్లో అడుగుపెట్టడమే ఫేస్‌బుక్ తాజా టేకోవర్ ప్రధానోద్దేశంగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి.

అంతేకాకుండా ఫేస్‌బుక్ డిజిటల్ అడ్వర్టైజింగ్ వ్యాపారాన్ని మరింత పెంచడంలో కూడా ఈ కొనుగోలు ఉపకరిస్తుందని భావిస్తున్నారు.
 
గతేడాది యాడ్‌ల రూపంలో ఫేస్‌బుక్‌కు 12.6 బిలియన్ డాలర్ల ఆదాయం లభించింది. ఇప్పుడు తమ ఇరు కంపెనీల కలయికతో యూజర్ల అవసరాలకు సంబంధించిన యాడ్‌లను మరింత మెరుగ్గా అందించగలుగుతామని ఫేస్‌బుక్ ఒక ప్రకటనలో పేర్కొంది. ప్రపంచంలోని ఏ ఉత్పత్తినైనా అన్వేషించేందుకు వీలుకల్పించేలా 2006లో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.దఫైండ్.కామ్ ఆవిర్భవించింది. దీని సహ వ్యవస్థాపకుడు, సీఈఓ శివ కుమార్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీఓ) శశికాంత్ ఖండేల్వాల్ ఇద్దరూ భారతీయులే కావడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement