విజయ్‌మాల్యాపై ఈడీ మరో చార్జి షీటు

ED chargesheet names Vijay Mallya, United Breweries - Sakshi

ముంబై: రుణాల ఎగవేత ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యాపారవేత్త విజయ్‌ మాల్యాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తాజాగా మరో చార్జి షీటు వేసింది. రూ.6,000 కోట్ల మేర బ్యాంకుల కన్సార్షియంను మోసగించారంటూ మాల్యా, కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్, యునైటెడ్‌ బ్రూవరీస్,  మరికొందరిపై దీన్లో అభియోగాలు దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.

ప్రాసిక్యూషన్‌ ఫిర్యాదు కింద పరిగణించి... ఈ చార్జి షీటును మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ముంబైలోని ప్రత్యేక కోర్టులో ఈడీ దాఖలు చేసింది. 2005–10 మధ్య కాలంలో రుణ వాయిదాల చెల్లింపులు జరపకపోవడం వల్ల రూ.6,027 కోట్ల మేర నష్టపోయిన కేసుకు సంబంధించి ఎస్‌బీఐ సారథ్యంలోని బ్యాంకుల కన్సార్షియం చేసిన ఫిర్యాదు మేరకు ఈడీ తాజా చార్జి షీటు దాఖలు చేసింది.

కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ ఐడీబీఐ బ్యాంకు నుంచి తీసుకున్న రూ. 900 కోట్ల ఎగవేత కేసుకు సంబంధించి మాల్యాపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ గతేడాది తొలి చార్జిషీటు వేసింది. ఈ కేసులో ఇప్పటిదాకా రూ. 9,890 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేసింది. దేశం విడిచి వెళ్లిపోయిన మాల్యా ప్రస్తుతం లండన్‌లో ఉంటున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top