రూ.150 కోట్ల గోల్డ్ క్వెస్ట్ ఆస్తులు అటాచ్ | ED attaches assets worth over Rs 150 crore under PMLA of M/s Gold Quest International, Chennai | Sakshi
Sakshi News home page

రూ.150 కోట్ల గోల్డ్ క్వెస్ట్ ఆస్తులు అటాచ్

Apr 5 2017 8:11 PM | Updated on Sep 27 2018 5:03 PM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మల్టిలెవల్ మార్కెటింగ్ స్కాంలో మలేషియా గోల్డ్ క్వెస్ట్ సంస్థకు చెందిన విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మల్టిలెవల్ మార్కెటింగ్ స్కాంలో మలేషియా గోల్డ్ క్వెస్ట్ సంస్థకు చెందిన విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) 2002 చట్టం కింద 150 కోట్ల రూపాయల  చెన్నైలోని సంస్థ ఆస్తులను ఆటాచ్ చేసినట్టు ఈడీ ప్రకటించింది. మనీ సర్క్యూలేషన్ స్కీం పేరిట దాదాపు 1250 కోట్లు ఆర్జించిందనే ఆరోపణలతో మలేషియా గోల్డ్ సంస్థ డైరెక్టర్ పుష్పం అ‍ప్పలనాయుడిని 2014లో అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తానిచ్చే బంగారు పురాతన నాణెం ఎంతో విలువైనదంటూ మనీ సర్క్యూలేషన్ స్కీం పేరిట అమాయకుల వద్ద నుంచి డబ్బు గుంజుకున్నదని ఆమెపై అభియోగం.
 
2009 నుంచి ఈ ఘరానా లేడీకోసం గాలించగా.. 2014లొ ఆమె పట్టుబడింది. చెన్నైలో ఈ సంస్థకు చెందిన బంగారం, వెండి కాయిన్స్ గోడౌన్‌ను అంతకముందే సీఐడీ సీజ్ చేసింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఆంధ్రా, శ్రీలంకలోని ఈ సంస్థ డైరెక్టర్లపై కూడా కేసులు నమోదైయ్యాయి. మలేషియా కేంద్రంగా మనీ సర్క్యులేషన్ రాకెట్‌ను పుష్పం అప్పలనాయుడు  నడిపినట్లు తెలిసింది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement