రూపాయి పతనం: కండోమ్‌ యాడ్‌ వైరల్‌ | Durex Condoms takes Rupee Fall Halts Against US Dollar | Sakshi
Sakshi News home page

Jul 1 2018 5:01 PM | Updated on Jul 1 2018 5:16 PM

Durex Condoms takes Rupee Fall Halts Against US Dollar - Sakshi

కాదేది ప్రకటనకు అనర్హం అంటోంది ‘డ్యూరెక్స్‌ ఇండియా’ కండోమ్‌ కంపెనీ..

కాదేది కవితకు అనర్హం అని అన్నాడు మహాకవి శ్రీశ్రీ...... దానికి దీటుగా కాదేది ప్రకటనకు అనర్హం అంటోంది ‘డ్యూరెక్స్‌ ఇండియా’ కండోమ్‌ కంపెనీ. అవును గత కొద్ది రోజులుగా రూపాయి పతనం దేశ ఆర్థిక వ్యవస్థను ఇబ్బంది పెడుతోన్న విషయం తెలిసిందే. ఇంటర్‌ బ్యాంక్‌ ఫారిన్‌ ఎక్స్‌ఛేంజ్ (ఫారెక్స్‌) మార్కెట్‌ ట్రేడింగ్‌లో డాలర్‌ విలువతో పోల్చితే ప్రస్తుతం రూ.68.45గా ఉంది. కొద్ది రోజుల కిందట దీని విలువ 68.79 నుంచి 69.10కి కూడా పడిపోయింది. 

అయితే, రూపాయి అత్యంత కనిష్టంగా రూ.69.10కి పడిపోవడాన్ని కూడా ‘డ్యూరెక్స్ ఇండియా’ కండోమ్ సంస్థ అందిపుచ్చుకుంది. రూపాయి విలువ పతనాన్ని ఉపయోగించుకుని సోషల్‌ మీడియాలో ఓ ప్రకటన ఇచ్చేసింది. ప్రస్తుతం ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్‌ అయింది. రూపాయి విలువ 69కి పడిపోవడంలో డ్యూరెక్స్‌ కంపెనీకి ఓ కొత్త కోణం కనిపించింది. వెంటనే ఓ పక్రటనను రూపొందించింది. సెక్స్‌ పొజిషన్లలో ఎక్కువగా చెప్పుకునే ‘69’ భంగిమను ఉద్దేశిస్తూ.. ఈ ప్రకటన రూపొందించింది. ‘‘ ఈ భంగిమలో రూపాయి సరిగా పని చేయకపోవచ్చు. కానీ, మీరు చేయగలరు’’ అంటూ ఆ సంస్థ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement