తెనాలి కేంద్రంగా 6 వేల కోట్ల కుంభకోణం | Duplicate MCX Server Scam: 6 Crores Scam at Tenali | Sakshi
Sakshi News home page

తెనాలి కేంద్రంగా 6 వేల కోట్ల కుంభకోణం

Sep 12 2014 3:41 PM | Updated on Sep 2 2017 1:16 PM

నకిలీ మల్టీ కమాడిటీస్ ఎక్స్సెంజ్(ఎంసీఎక్స్) ద్వారా ఆరువేల కోట్ల ఇన్వెస్టర్ల సొమ్మును దోచుకున్నట్టు తెలుస్తోంది.

హైదరాబాద్: తెనాలి కేంద్రంగా వేల కోట్ల రూపాయల కుంభకోణం వెలుగులోకి వచ్చింది. నకిలీ మల్టీ కమాడిటీస్ ఎక్స్సెంజ్(ఎంసీఎక్స్) ద్వారా ఆరువేల కోట్ల ఇన్వెస్టర్ల సొమ్మును దోచుకున్నట్టు తెలుస్తోంది. ఎంసీఎక్స్ డూప్లికేట్ సర్వర్ ద్వారా అక్రమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు పోలీసులకు సమాచారం అందింది. తెనాలి కేంద్రంగా నిర్వహిస్తున్న జీరో దందా ద్వారా ఆరువేల కోట్ల రూపాయల ఇన్వెస్టర్ల సొమ్మును దోచుకున్నట్టు సమాచారం. 
 
ఈ అక్రమ దందా 63 సెంటర్లలో నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. నెదర్లాండ్ కేంద్రంగా ఆపరేషన్ కు తెర తీసినట్టు వార్తలు వెలువడుతున్నాయి. మాజీ ఉద్యోగులపైనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నకిలీ సర్వర్ ఏర్పాటు చేసి అక్రమ ఖాతాకు 6 వేల కోట్లు తరలించినట్టు పోలీసులు వెల్లడిస్తున్నారు. ఈ నకిలీ దందాపై పోలీసులు విచారణ ప్రారంభించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement