ఆధార్‌ లింక్‌ గడువు పెంపు | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాలకు ఆధార్‌ లింక్‌ గడువు పెంపు

Published Wed, Mar 28 2018 7:15 PM

Deadline For Linking Aadhaar With Welfare Schemes Extended - Sakshi

న్యూఢిల్లీ : ప్రభుత్వం నుంచి సబ్సిడి ప్రయోజనాలు పొందుతోన్న వివిధ సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఆధార్‌ లింక్‌ గడువు పొడిగించారు. ఈ నెల 31 వరకు ఉన్న ఈ గడువును తాజాగా మరో మూడు నెలలు పొడిగించినట్టు ప్రభుత్వం ప్రకటించింది. అంటే సంక్షేమ పథకాలకు ఆధార్‌ అనుసంధాన ప్రక్రియను జూన్‌ 30 వరకు చేపట్టకోవచ్చు. సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానానికి ఇచ్చిన గడువు (మార్చి 31)ని మార్చకూడదని మొదట భావించినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మరోసారి ఈ అంశంపై చర్చించి ఆధార్ అనుసంధానం చేసుకోని లబ్దిదారులకు ఈ వెసులుబాటును కల్పించింది. 

ఈ ఏడాది జూన్ 30 వరకు సంక్షేమ పథకాలకు ఆధార్ అనుసంధానం చేసుకోవచ్చని ఓ ప్రకటనలో తెలిపింది. కాగా, పాన్‌కార్డుకు ఆధార్ అనుసంధానం చేసుకోలేకపోయిన వారికి కూడా నిన్న సీబీడీటీ శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే. ఈ ప్రక్రియ పూర్తి చేసుకునేందుకు గడువును ఈ ఏడాది జూన్‌ 30 వరకు పొడిగించినట్లు పేర్కొంది. టెలికాం డిపార్ట్‌మెంట్‌ కూడా సుప్రీంకోర్టు తుది తీర్పు ఇచ్చేంత వరకు మొబైల్‌ యూజర్లు తమ ఆధార్‌ అనుసంధానం చేపట్టుకోవచ్చని తెలిపింది. 

Advertisement
Advertisement