డేటా ప్యాక్ @ రూ.2 | data pack @ 2 rs in telenor | Sakshi
Sakshi News home page

డేటా ప్యాక్ @ రూ.2

Mar 15 2016 12:40 AM | Updated on Sep 3 2017 7:44 PM

డేటా ప్యాక్ @ రూ.2

డేటా ప్యాక్ @ రూ.2

పల్లెలో అయినా సరే చాయ్ తాగాలంటే కనీసం రూ.5 వెచ్చించాలి.

టెలికం రంగంలో టెలినార్ సంచలనం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పల్లెలో అయినా సరే చాయ్ తాగాలంటే కనీసం రూ.5 వెచ్చించాలి. కానీ అంత కంటే తక్కువ ధరకే డేటా ప్యాక్‌ను ఊహించగలమా? టెలికం రంగంలో సంచలనానికి తెరలేపుతూ టెలినార్ ఫుల్ పైసా వసూల్ పేరుతో రూ.2లకే డేటా వోచర్‌ను ఆఫర్ చేస్తోంది. ఇందులో భాగంగా ఒక రాత్రి కాల పరిమితితో 50 ఎంబీ డేటాను అందిస్తోంది. ఇంత తక్కువ ధరలో డేటా ప్యాక్‌ను అందుబాటులోకి తేవడం భారత్‌లో ఇదే తొలిసారి అని కంపెనీ వెల్లడించింది. దీనితోపాటు రూ.5 మొదలుకుని రూ.146 వరకు నూతన డేటా ప్యాక్స్‌ను 30 ఎంబీ - 2 జీబీ ప్రయోజనాలతో ప్రకటించింది. కొత్త కస్టమర్లకు 200 ఎంబీ డేటా ఉచితంగా ఇస్తోంది. అందుబాటు ధరలో వినూత్న ప్యాక్‌లతో వినియోగదార్ల ప్రాధాన్య ఆపరేటర్‌గా నిలవాలన్నది తమ లక్ష్యమని టెలినార్ ఏపీ, తెలంగాణ సర్కిల్ బిజినెస్ హెడ్ శ్రీనాథ్ కొటియన్ ఈ సందర్భంగా  తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement