వావ్‌.. వాట్‌ ఏ క్రేజ్‌! 

Crazy Sales Of New Model Royal Enfield Bikes - Sakshi

178 సెకండ్లలో 250 రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ బైకుల అమ్మకం   

న్యూఢిల్లీ : కొత్త కొత్త హంగులతో ఎన్నో బైకులు మార్కెట్లోకి వచ్చినా.. రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌కు ఉన్న క్రేజే వేరు. అది ఎంతలా ఉందంటే.. తాజాగా మార్కెట్లోకి వచ్చిన ఎన్‌ఫీల్డ్‌ క్లాసిక్‌ 500 పెగాసస్‌ ఎడిషన్‌ బైకులు హాట్‌ కేకుల్లా అమ్ముడుపోయాయట. ఈ లిమిటెడ్‌ ఎడిషన్‌ బైక్‌లను ప్రపంచవ్యాప్తంగా కేవలం వెయ్యి మాత్రమే తయారుచేశారు. అందులో 250 యూనిట్లను ఇండియా కోసం కేటాయించారు. దీనికోసం బుధవారం సాయంత్రం 4 గంటలకు సేల్‌ ప్రారంభించగా.. కేవలం మూడు నిమిషాల్లోపే అంటే 178 సెకన్లలోనే అన్ని బైకులూ అమ్ముడయ్యాయి. ఇదో కొత్త రికార్డుగా ఆ సంస్థ వెల్లడించింది. ఈ పెగాసస్‌ ధర రూ.2.4 లక్షలు. ఎన్‌ఫీల్డ్‌ నుంచి వస్తున్న అత్యంత ఖరీదైన బైక్‌ ఇదే కావడం విశేషం.    

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top