చైనా మొబైల్స్‌ హవా: కొనుగోళ్లు జూమ్‌

Chinese phones in FY18  is Indians spent over Rs 50k crore - Sakshi

చైనా మొబైల్స్‌కు ఇండియాలో పెరుగుతున్న ఆదరణ

2018లో  రూ. 50వేల కోట్ల విలువైన కొనుగోళ్లు

టాప్‌లో షావోమి, ఒప్పో,  వివో, హానర్‌

సాక్షి, ముంబై: చైనా సంస్థలు తయారు చేసిన స్మార్ట్‌ఫోన్లకు దేశీయంగా  ఉన్న క్రేజ్‌ ఇంతా అంతాకాదు. ఈ స్మార్ట్‌ఫోన్లకు భారతీయుల  ఆదరణ రోజు రోజుకు  పెరుగుతోందే తప్ప తరగడంలేదు. తాజాగా  భారతీయ వినియోగదారులు వేలకోట్ల రూపాయల కొనుగోళ్లు జరిపారు. ముఖ్యంగా  అద్భుత ఫీచర్లు,  సరసమైన ధరల్లో చైనా ఉత్పత్తి సంస్థలు వినియోగదారులను కట్టిపడేస్తుండటంతో ఈ ధోరణి మరింత పెరుగుతోంది.  ఆకర్షణీయమైన ఫోన్లను  అందుబాటులోకి తీసుకొస్తూ ఇబ్బడిముబ‍్బడిగా లాభాలను  సొంతం చేసుకుంటున్నాయి.

2018 ఆర్థిక సంవత్సరంలో 50వేలకోట్లను  చైనా స్మార్ట్‌ఫోన్లపై వెచ్చించారు. గత ఏడాదితో పోలిస్తే  ఇది దాదాపు రెట్టింపు. ముఖ్యంగా చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ దిగ్గజాలు షావోమి, ఒప్పో, వివో, హానర్‌ కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయి. వీటితో పాటు లెనోవో, మోటరోలా, వన్‌ప్లస్‌, ఇనిఫినిక్స్‌ లాంటి కంపెనీలు భారతీయ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌  విక్రయాల్లో  సగానికిపైగా వాటాను కొల్లగొట్టాయి.  అలాగే ప్రస్తుత గణాంకాల ప్రకారం చైనా బ్రాండ్లస్మార్ట్‌ఫోన్లకు  దేశీయంగా డిమాండ్‌ విపరీతంగా పెరుగుతున్న ధోరణి కనిపిస్తోందని ఎనలిస్టులు, పరిశ్రమ ప్రతినిధులు విశ్లేషించారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top