చైనాతో ముప్పు ఉంది.. జర జాగ్రత్త! | China slowdown a threat to world economy, says Rajan | Sakshi
Sakshi News home page

చైనాతో ముప్పు ఉంది.. జర జాగ్రత్త!

May 26 2016 3:18 PM | Updated on Sep 4 2017 12:59 AM

చైనాతో ముప్పు ఉంది.. జర జాగ్రత్త!

చైనాతో ముప్పు ఉంది.. జర జాగ్రత్త!

చైనా చూపిస్తున్న నెమ్మదస్తు ఆర్థికవ్యవస్థ గణాంకాలపై ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆరోపణలు చేశారు.

ముంబై : చైనా చూపిస్తున్న నెమ్మదస్తు ఆర్థికవ్యవస్థ గణాంకాలపై ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆరోపణలు చేశారు. గ్లోబల్ ఎకనామీకి ఇది ముప్పువాటిల్లే  అవకాశముందని హెచ్చరించారు. భారత్ లాంటి ఇతర ఆర్థిక వ్యవస్థలు ఈ ముప్పు నుంచి తట్టుకోవడానికి  అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చైనా పక్కన ఉన్న దేశాలకు మధ్యవర్తిత్వ బ్యాంకింగ్ సిస్టమ్(గ్లోబల్ ఫైనాన్సియల్ సిస్టమ్ లో రుణాన్ని కల్పించడం) నుంచి తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు..

దక్షిణ ప్రాంతీయ సహకార ఆసియా అసోసియేషన్ గ్రూపింగ్(సార్క్) సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల సదస్సులో రాజన్ ప్రసంగించారు. భారత ఆర్థిక క్యాపిటల్ ను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తూ.. ఆయన చైనా ఆర్థికవ్యవస్థ చూపించే గణాంకాల ప్రభావం ఇతర ఆర్థికవ్యవస్థలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.  ప్రస్తుతం బ్యాంకింగ్ సిస్టమ్ లో మొండిబకాయిల బెడద పెరగడం, మధ్యవర్తిత్వ బ్యాంకింగ్ సిస్టమ్ లో తీవ్రమైన బలహీనతలు సార్క్ ఆర్థికవ్యవస్థల్లో మందగమనం నెలకొనేలా చేస్తాయన్నారు.  చైనా ఆర్థికాభివృద్ధి కేవలం పాలసీల మీదే ఆధారపడి లేదని, ప్రపంచ వృద్ధిపైనా కూడా ఆధారపడి ఉందని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement