స్టెర్లింగ్‌ బయోటెక్‌ డైరెక్టర్లు, పలువురిపై చీటింగ్‌ కేసు | CBI registers fresh case against Sterling Biotech, its directors, for “cheating” PSU banks | Sakshi
Sakshi News home page

 స్టెర్లింగ్‌ బయోటెక్‌ డైరెక్టర్లు, పలువురిపై చీటింగ్‌ కేసు

Oct 28 2017 4:56 PM | Updated on Oct 28 2017 5:47 PM

CBI registers fresh case against Sterling Biotech, its directors, for “cheating” PSU banks



సాక్షి, న్యూఢిల్లీ: గుజరాత్‌కు చెందిన స్టెర్లింగ్ బయోటెక్ లిమిటెడ్పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) తాజా కేసు నమోదు చేసింది.  స్లెర్లింగ్‌  బయోటెక్‌ సీనియర్‌  అధికారులు, మరికొంతమందిపై  చీటింగ్‌  కేసు నమోదు చేసింది.  

రూ. 5,383 కోట్ల మేర ప్రభుత్వ రంగ బ్యాంకులను మోసం చేసిన కేసులో సీబీఐ  సంస్థ డైరెక్టర్స్ చేతన్ జయంతిలాల్ సండేశ్వర, దీప్తి చేతన్ సందేశరా, రాజ్‌భూషణ్ ఓంప్రకాష్ దీక్షిత్, నితిన్ జయంతిలాల్ సందేశ్రా, విలాస్ దత్తాత్రేయ జోషి పై కేసు నమోదు చేసింది. వీరితోపాటు  చార్టర్డ్ అకౌంటెంట్ హేమంత్ హాథి, ఆంధ్రా బ్యాంక్ డైరెక్టర్ అనూప్ గార్గ్,  గుర్తు తెలియని ప్రైవేట్ , ప్రభుత్వ అధికారులను కూడా ఈ కేసులో  చేర్చింది.   స్టెర్లింగ్ బయోటెక్ గ్రూపు లోని కంపెనీల ద్వారా విదేశాల్లోని తన సంస్థలకు రుణాన్ని  స్టెర్లింగ్ బయోటెక్ మళ్లించిందని సీబీఐ ఆరోపించింది. స్టెర్లింగ్ బయోటెక్ షేర్లలో వర్తకం కోసం ఆఫ్-మార్కెట్ లావాదేవీలకు  "బినామి" సంస్థలను ఉపయోగించినట్టు  పేర్కొంది.  హవాలా ఆపరేటర్ల సహాయంతో ఢిల్లీలోని ఆంధ్ర బ్యాంక్ డైరెక్టర్  అనూప్ కుమార్ గార్క్‌కు డబ్బు సరఫరా చేస్తున్నారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొంది. ఇది కచ్చితంగా ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌,  సాధారణ ప్రజల్ని  మోసగించడం కిందికే వస్తుందని తెలిపింది. 

కాగా 2011 లో జరిగిన విచారణల నేపథ్యంలో గత ఆగస్టులో  స్టెర్లింగ్ బయోటెక్  డైరెక్టర్లు  సహా ముగ్గురు సీనియర్  ఆదాయ పన్ను అధికారులపై కేసు నమోదు చేసింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement