లండన్‌లో సీబీఐ, ఈడీ బృందం | CBI, ED team in London for  Mallya's extradition hearing | Sakshi
Sakshi News home page

లండన్‌లో సీబీఐ, ఈడీ బృందం

Dec 4 2017 4:05 PM | Updated on Dec 4 2017 5:08 PM

CBI, ED team in London for  Mallya's extradition hearing - Sakshi

లండన్:లిక్కర్‌ దిగ్గజం విజయ్‌ మాల్యా అప్పగింత కేసులో బ్రిటన్‌ కోర్టులో విచారణ నిమిత్తం సీబీఐ, ఈడీ జాయింట్‌ టీమ్‌ లండన్‌కు చేరుకుంది. బ్యాంకులకు రూ వేల కోట్ల రుణాల ఎగవేత కేసులో మాల్యా విచారణ ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. మాల్యా అప్పగింత కేసులో తమ న్యాయవాదులకు సీబీఐ,ఈడీ బృందం సహకరించనుంది.

మాల్యాకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలను సమర్పించి ఆయనను భారత్‌కు అప్పగించేలా చూస్తామని భారత దర్యాప్తు సంస్థలు ఆశాభావం వ్యక్తం చేశాయి. భారత్‌ తరపున క్రౌన్‌ ప్రాసిక్యూషన్‌ సర్వీస్‌ వెస్ట్‌మినిస్టర్‌ కోర్టులో వాదనలు వినిపిస్తోంది.

మాల్యా కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ కోసం రుణాలంటూ ప్రభుత్వ రంగ బ్యాంకులను మోసం చేసి నిధులను ఎలా దారి మళ్లించారో వివరిస్తూ 2000 పేజీలతో కూడిన సవివర నివేదికను కోర్టుకు సమర్పించినట్టు సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. అదనపు డాక్యుమెంటరీ ఎవిడెన్స్‌ను కూడా కోర్టు ముందుంచినట్టు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement