రిటర్న్స్‌ దాఖలు చేయని వారు 67.54 లక్షల మంది | CBDT identifies 67.54 lakh income tax non-filers for FY15 | Sakshi
Sakshi News home page

రిటర్న్స్‌ దాఖలు చేయని వారు 67.54 లక్షల మంది

Dec 23 2016 12:48 AM | Updated on Sep 27 2018 4:47 PM

రిటర్న్స్‌ దాఖలు చేయని వారు 67.54 లక్షల మంది - Sakshi

రిటర్న్స్‌ దాఖలు చేయని వారు 67.54 లక్షల మంది

ఆదాయపు పన్ను శాఖ తాజాగా ట్యాక్స్‌ రిటర్నులను దాఖలు చేయని వారి సంఖ్య 67.54 లక్షలుగా ఉన్నట్లు పేర్కొంది.

సీబీడీటీ
న్యూఢిల్లీ: ఆదాయపు పన్ను శాఖ తాజాగా ట్యాక్స్‌ రిటర్నులను దాఖలు చేయని వారి సంఖ్య 67.54 లక్షలుగా ఉన్నట్లు పేర్కొంది. వీరందరూ 2014–15 ఆర్థిక సంవత్సరంలో అధిక విలువ కలిగిన లావాదేవీలను నిర్వహించారని, కానీ ట్యాక్స్‌ రిటర్న్స్‌ను మాత్రం దాఖలు చేయలేదని తెలిపింది. కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) నేతృత్వంలోని నాన్‌–ఫైలర్స్‌ మానిటరింగ్‌ సిస్టమ్‌ (ఎన్‌ఎంఎస్‌) వీరిని గుర్తించింది. ఈ 67.54 లక్షల మంది 2014–15 ఆర్థిక సంవత్సరంలో అధిక విలువ కలిగిన లావాదేవీలను నిర్వహించారు.

కానీ వీరు 2015–16 అసెస్‌మెంట్‌ సంవత్సరానికి వారి ఆదాయానికి సంబంధించి ట్యాక్స్‌ రిటర్న్స్‌ దాఖలు చేయలేదు’ అని సీబీడీటీ వివరించింది. కేంద్ర ప్రభుత్వం చెబుతోన్న ప్రకారం పన్ను చెల్లింపుదారులు వారి నిజ ఆదాయాన్ని వెల్లడించాలని, లేనిపక్షంలో వీరు తమ వద్ద నుంచి తప్పించుకోలేరని పేర్కొంది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement