పీఎస్‌యూ సాధారణ బీమా సంస్థలను కలిపేయాలి | Call for merger of PSU general insurance cos | Sakshi
Sakshi News home page

పీఎస్‌యూ సాధారణ బీమా సంస్థలను కలిపేయాలి

Aug 18 2014 12:55 AM | Updated on Apr 3 2019 8:42 PM

నాలుగు ప్రభుత్వ రంగ సాధారణ బీమా కంపెనీలన్నింటినీ విలీనం చేసి ఒకే కంపెనీగా ఏర్పాటు

ముంబై: ఇప్పుడున్న నాలుగు ప్రభుత్వ రంగ(పీఎస్‌యూ) సాధారణ బీమా కంపెనీలన్నింటినీ విలీనం చేసి ఒకే కంపెనీగా ఏర్పాటు చేయాలని ఆయా సంస్థల ఉద్యోగ సంఘాలు(యూనియన్లు) డిమాండ్ చేశాయి. ప్రస్తుతం దేశంలో న్యూ ఇండియా ఎష్యూరెన్స్(ముంబై), నేషనల్ ఇన్సూరెన్స్(కోల్‌కతా), యునెటైడ్ ఇండియా ఇన్సూరెన్స్(చెన్నై), ఓరియెంటల్ ఇన్సూరెన్స్(న్యూఢిల్లీ) పీఎస్‌యూలు సాధారణ బీమా(నాన్-లైఫ్‌ఇన్సూరెన్స్)  కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి.

మార్కెట్ వాటాను పటిష్టం చేయడం, లాభదాయకత పెంపునకు విలీనమే ఉత్తమమని యూనియన్లు పే ర్కొన్నాయి. ఈ 4 కంపెనీల  బీమా ఆస్తుల (అసెట్స్) విలువ రూ.1,02,000 కోట్లుగా అంచనా. రూ.15,000 కోట్ల నగదు నిల్వలు, రూ.550 కోట్ల మూలధనం వీటికి ఉన్నాయి. ఇటీవలే ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీతో భేటీ సందర్భంగా భారతీయ వీమా కామ్‌గార్ సేన(బీవీకేఎస్) ప్రతి నిధులు ఈ డిమాండ్‌ను వినిపిం చారు. ఈ 4 కంపెనీ ల యూనియన్లకూ బీవీకేఎస్‌లో ప్రాతినిధ్యం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement