అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఆర్థిక ఉగ్రవాద సంస్థలు!

CAIT seeks action against Flipkart, Amazon for FDI norms - Sakshi

ఎఫ్‌డీఐ నిబంధనలు ఉల్లంఘించాయ్‌ 

వాటిపై చర్య తీసుకోండి: కెయిట్‌

న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు ఆర్థిక ఉగ్రవాద సంస్థలని అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) తీవ్రంగా విమర్శించింది. ఇవి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల (ఎఫ్‌డీఐ) నిబంధనలను ఉల్లంఘించాయని, వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. చిన్న వ్యాపారస్తులు గత ఏడాది కాలంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, ఇంకా ఇతర ఈ–కామర్స్‌ సంస్థల చేతుల్లో విలవిలలాడుతున్నాయని, ఫలితంగా వాటి వ్యాపారం దెబ్బతిన్నదని  ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, భారతలోని చట్టాల ప్రకారమే వ్యాపారం చేస్తున్నామని, ఎలాంటి ఎఫ్‌డీఐ నిబంధనల ఉల్లంఘనకు పాల్పడలేదని ఫ్లిప్‌కార్ట్‌ స్పష్టం చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top