బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులకు కీలక ఆదేశాలు

BSNL orders officers to fly economy class to cut costs  - Sakshi

ఖర్చులు తగ్గించుకునే క్రమంలో బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారులకు కీలక అదేశాలు

దేశీయ, అంతర్జాతీయ  విమాన ప్రమాణాల్లో ఎకానమీ క్లాస్‌కు ప్రాధాన్యం

సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థికసంక్షోభంలో చిక్కుకున్న ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ  బీఎస్‌ఎన్‌ఎల్‌  తన అధికారులకు కీలక  ఆదేశాలు జారీ చేసింది.  ఖర్చులను తగ్గించుకునే క్రమంలో తమ అధికారులు ఎకానమీ విమానాల్లో ప్రయాణించాలని కోరింది. ఈ మేరకు  కంపెనీ తాజా ఉత్తర్వులు  జారీ చేసింది.  ఆర్థిక ఇబ్బందుల మధ్య ఖర్చులను మరింత తగ్గించే చర్య, ప్రభుత్వ-టెలికాం మేజర్ బిఎస్ఎన్ఎల్ తన అధికారులందరినీ కార్యాలయ ఉత్తర్వు ప్రకారం దేశీయ, అంతర్జాతీయ విమాన ప్రయాణాలలో ఎకానమీ క్లాస్ ద్వారా   మాత్రమే ప్రయాణించాలని కోరింది.

సంస్థ  ప్రస్తుత ఆర్థిక ఒత్తిడి  నేపథ్యంలో సంస్థ  అధికారులందరూ ఇప్పుడు విమానప్రయాణాల్లో ఎకానమీ క్లాస్ (దేశీయ, అంతర్జాతీయ)ను ఎంచుకోవాలని బీఎస్ఎన్ఎల్కోరింది. జూలై 26 నాటి ఉత్తర్వుల ప్రకారం బీఎస్‌ఎన్‌ఎల్‌ అధికారిక పర్యటనలను తదుపరి ఉత్తర్వుల వరకు  ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని తెలిపింది.  అయితే,  బీఎస్‌ఎన్‌ఎల్‌ సీఎండీ ముందస్తు అనుమతితో,  అధికారులు వ్యాపార అవసరాల విషయంలో ఉన్నత తరగతిలో  ప్రయాణించవచ్చని  పేర్కొంది. 

ప్రభుత్వ రంగ సంస్థ 2015-16లో రూ. 4,859 కోట్లు, 2016-17లో రూ .4,793 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది.   కాగా డేటా-సెంట్రిక్ టెలికాం మార్కెట్లో మొబైల్ విభాగంలో తీవ్రమైన పోటీ, అధిక సిబ్బంది ఖర్చు , కొన్ని ప్రదేశాల్లో తప్ప 4 జి సేవలు లేకపోవడం  బిఎస్ఎన్ఎల్ నష్టాలకు ప్రధాన కారణాల ని టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ పార్లమెంటుకు చెప్పారు. ఆయన పార్లమెంటుకు ఇచ్చిన అధికారిక సమాచారం ప్రకారం, 2018-19లో రూ .14,202 కోట్లకు పెరగనుందని అంచనా.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top