బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్లాన్‌.. 5జీబీ డేటా | BSNL Brings Rs.109 ‘Mithram Plus Prepaid Plan With 5GB Data | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్‌ కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌, 5జీబీ డేటా

Dec 20 2019 1:26 PM | Updated on Dec 20 2019 2:21 PM

 BSNL Brings Rs.109 ‘Mithram Plus’ Prepaid Plan With 5GB Data - Sakshi

సాక్షి, ముంబై: భారత్ సంచార్ నిగం లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను లాంచ్‌ చేసింది. రూ. 90 రోజుల చెల్లుబాటుతో రూ. 109 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తాజాగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.  "మిత్రం ప్లస్"  పేరుతో తీసుకొచ్చిన ఈ ప్రీపెయిడ్ ప్లాన్‌లో మొత్తం 5  జీబీ డేటాను అందిస్తుంది. దీంతోపాటు రోజుకు  250 నిమిషాల వాయిస్ కాలింగ్‌ సదుపాయం లభ్యం. కొత్త ప్రీపెయిడ్ ప్లాన్ ప్రస్తుతం ఉన్న (రూ.49, రూ. 40, 500 ఎమ్‌బి డేటా, 15 రోజుల వాలిడిటీ) మిత్రం ప్లాన్లతో పాటు అందుబాటులో ఉండనుంది.

బీఎస్‌ఎన్‌ఎల్ కేరళ వెబ్‌సైట్‌లో లిస్టింగ్ ప్రకారం రూ. 109 మిత్రం ప్లస్ ప్లాన్ 5 జీబీ డేటా, ముంబై  ఢిల్లీ, సర్కిల్‌లతో సహా భారతదేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ప్రతిరోజూ 250 నిమిషాల వాయిస్ కాలింగ్‌ను అందిస్తుంది. అయితే  కేరళ సర్కిల్‌లోని బీఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెయిడ్ కస్టమర్లకు మాత్రమే ఈ ప్లాన్‌ వర్తిస్తుంది. దేశవ్యాప్తంగా మిగతా సర్కిళ్లకు త్వరలోనే రీఛార్జ్  ప్లాన్‌ను తీసుకురానుంది. అయితే ఎపుడు అందుబాటులోకి వచ్చేదీ స్పష్టత లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement