భారత మార్కెట్లో బీఎండబ్ల్యూ ‘మినీ క్లబ్‌మాన్‌’

BMW mini clubman in the Indian market - Sakshi

ధర రూ. 44.9 లక్షలు.. విక్రయానికి 15 యూనిట్లు 

ఈనెల 15 నుంచి అమెజాన్‌లో బుకింగ్స్‌

న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన ప్రముఖ లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ‘బీఎండబ్ల్యూ’.. భారత మార్కెట్లో ‘మిని క్లబ్‌మాన్‌’ కారును విడుదలచేసింది. కేవలం 7.2 సెకన్ల వ్యవధిలోనే సున్నా నుంచి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలిగిన ఈ పరిమిత ఎడిషన్‌ ధర రూ. 44.9 లక్షలు (ఎక్స్‌–షోరూం)గా కంపెనీ ప్రకటించింది. ఇండియన్‌ సమ్మర్‌ రెడ్‌ ఎడిషన్‌ పేరిట కేవలం 15 యూనిట్లను మాత్రమే ఇక్కడ విక్రయిస్తోంది. అమెజాన్‌ డాట్‌ ఇన్‌ వెబ్‌సైట్లో కారు బుకింగ్స్‌ ప్రారంభించనుంది. ఫిబ్రవరి 15 నుంచి బుకింగ్స్‌ ప్రారంభం కానున్నట్లు కంపెనీ వెల్లడించింది. వెనుకవైపు రెండు డోర్లు (స్లి్పట్‌ డోర్‌)తో కలిపి మొత్తం ఆరు డోర్లు కలిగిన ఈ కారుకు 2–లీటర్‌ 4–సిలెండర్‌ ఇంజిన్‌ను అమర్చింది. ట్విన్‌పవర్‌ టర్బో టెక్నాలజీతో ఇది పనిచేస్తుంది. 7–స్పీడ్‌ స్టెప్‌ట్రోనిక్‌ ట్రాన్స్‌మెషిన్‌ (డబుల్‌ క్లచ్‌) కలిగిన కొత్త కారు గరిష్టంగా గంటకు 228 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top