విశాఖలో బయోకాన్ యూనిట్ ఏర్పాటు | Biocon unit setup in Visakha | Sakshi
Sakshi News home page

విశాఖలో బయోకాన్ యూనిట్ ఏర్పాటు

Dec 15 2014 4:34 AM | Updated on Sep 2 2017 6:10 PM

విశాఖలో బయోకాన్ యూనిట్ ఏర్పాటు

విశాఖలో బయోకాన్ యూనిట్ ఏర్పాటు

విశాఖపట్టణంలో బయోకాన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు..

ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీలో కంపెనీ సీఎండీ వెల్లడి

సాక్షి, హైదరాబాద్: విశాఖపట్టణంలో బయోకాన్ మాన్యుఫాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఫార్మా రంగ దిగ్గజం, బయోకాన్ సంస్థ సీఎండీ కిరణ్ మజుందార్ షా ప్రకటించారు. ఆదివారం ఆమె ఏపీ సీఎం చంద్రబాబు నాయుడితో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ మజుందార్ షా మాట్లాడుతూ ఆర్నెల్లలో ఈ యూనిట్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. బయోకాన్ సంస్థ రూపొందించిన ఈ-హెల్త్‌కేర్ తద్వారా ఒనగూరే ప్రయోజనాలపై సీఎం చంద్రబాబుకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కిరణ్ వివరించారు.

టెలిమెడిసిన్ ద్వారా రోగుల ఆరోగ్య వివరాల్ని నెట్‌లో ఉంచి ఎలా వైద్య సేవలు పొందవచ్చో ఈ సందర్భంగా వివరించారు. ఈ-డయాగ్నోస్టిస్ కాన్సెప్ట్ గ్రామీణ పేదలకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని ఆమె తెలిపారు. ఆధునిక వైద్య సదుపాయాలు అందుబాటులో లేని గ్రామీణులకు, వైద్యం కోసం నగరాలకు రాలేని వారికి ఈ చికిత్సా విధానం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. ఒడిశాలో 50, రాజస్థాన్‌లో 100 కేంద్రాలను ఇప్పటికే ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏపీలోనూ 100 నుంచి 200 కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం చంద్రబాబు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement