భీమ్‌ యస్‌ పే | Bhim Yes Pay | Sakshi
Sakshi News home page

భీమ్‌ యస్‌ పే

Nov 6 2017 1:28 AM | Updated on Nov 6 2017 1:28 AM

Bhim Yes Pay - Sakshi

ప్రైవేట్‌ రంగంలోని ‘యస్‌ బ్యాంక్‌’ వినియోగదారుల కోసం ‘భీమ్‌ యస్‌ పే’ యాప్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇది ఒక స్మార్ట్‌ పేమెంట్‌ యాప్‌. దీన్ని గూగుల్‌ ప్లేస్టోర్‌ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

ప్రత్యేకతలు

⇒ భీమ్‌ యస్‌ పే యాప్‌ను ఉపయోగించాలనుకుంటే మీరు యస్‌ బ్యాంక్‌ కస్టమరే కానక్కర్లేదు.
⇒  యూపీఐ: డబ్బుల్ని పంపొచ్చు. పొందొచ్చు. అకౌంట్‌లో బ్యాలెన్స్‌ ఎంత ఉందో చూడొచ్చు. గత లావాదేవీల వివరాలు తెలుసుకోవచ్చు. –
⇒   వర్చువల్‌ కార్డ్‌: యస్‌ పే యూజర్లు ఉచిత వర్చువల్‌ కార్డును పొందొచ్చు. దీని సాయంతో ఈ–కామర్స్‌ సైట్లలో చెల్లింపులు చేయవచ్చు.
⇒   భారత్‌ క్యూఆర్‌ ఫీచర్‌ అందుబాటులో ఉంది.
⇒ యస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్స్‌: యస్‌ బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డులను లింక్‌ చేసుకొని, అకౌంట్‌ను మేనేజ్‌ చేసుకోవచ్చు. అంటే కార్డ్‌ బిల్లులు చెల్లించొచ్చు. స్టేట్‌మెంట్లు పొందొచ్చు. కార్డ్‌ను బ్లాక్‌ చేసుకోవచ్చు.
⇒  యస్‌ బ్యాంక్‌ సహా ఇతర బ్యాంకుల ఖాతాల నుంచి డెబిట్‌ కార్డు లేదా నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా వాలెట్‌లోకి డబ్బుల్ని ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు.
⇒  డీటీహెచ్‌తోపాటు ప్రి–పెయిడ్‌ మొబైల్‌ రీచార్జ్‌లను నిర్వహించుకోవచ్చు. ఇతర బిల్లులు చెల్లించొచ్చు.
⇒  ప్రతి ట్రాన్సాక్షన్‌పై రివార్డు పాయింట్లను పొందొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement