
అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు సమసిపోయాయనే సంకేతాలతో స్టాక్ మార్కెట్లు లాభాల బాట పట్టాయి.
ముంబై : అంతర్జాతీయ పరిణామాలకు సంబంధించి సానుకూల సంకేతాలతో స్టాక్ మార్కెట్లు లాభాల బాటపట్టాయి. మెటల్, బ్యాంకింగ్, ఫార్మా సహా పలు రంగాల షేర్లలో కొనుగోళ్ల జోరుతో కీలక సూచీలు పైపైకి ఎగిశాయి. ఎస్‌బీఐ, టాటా స్టీల్, ఇన్ఫోసిస్ షేర్లు లాభపడుతుండగా, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్ షేర్లు నష్టపోతున్నాయి. మొత్తంమీద బీఎస్‌ఈ సెన్సెక్స్ 172 పాయింట్ల లాభంతో 41,624 పాయింట్ల వద్ద ట్రేడవుతుండగా, 67 పాయింట్లు కోల్పోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 12,283 పాయింట్ల వద్ద ట్రేడవుతోంది.