మార్కెట్లోకి బజాజ్‌ మిక్సర్లు  | Bajaj Electricals launched new range mixer grinders in the market | Sakshi
Sakshi News home page

మార్కెట్లోకి బజాజ్‌ మిక్సర్లు 

Feb 5 2019 4:10 AM | Updated on Feb 21 2019 7:32 PM

Bajaj Electricals launched new range mixer grinders in the market - Sakshi

హైదరాబాద్‌: కన్జ్యూమర్‌ డ్యూరబుల్స్‌ తయారీ కంపెనీ బజాజ్‌ ఎలక్ట్రికల్స్‌ కొత్తశ్రేణి మిక్సర్‌ గ్రైండర్లను విపణిలోకి విడుదల చేసింది. బజాజ్‌ స్ట్రోమిక్స్‌ ఎంజీ, ట్విస్టర్‌ డీఐఎక్స్‌ ఎంజీ, మేవ్‌రిక్‌ ఎంజీ, ట్విస్టర్‌ ఫ్రూటీ ఎంజీ, హెక్సాగ్రిడ్‌ ఎంజీ, డబ్ల్యూఎక్స్‌1 వెట్‌ గ్రైండర్లను ఏపీ, తెలంగాణ మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఒకేసారి 6 ఉత్పత్తులను విడుదల చేయడం తొలిసారని.. మిక్సర్‌ గ్రైండర్ల మార్కెట్లో దక్షిణాది రాష్ట్రాల వాటా 40 శాతం వరకుంటుందని కంట్రీ హెడ్‌ అతుల్‌ శర్మ తెలిపారు. 

అనవసర పాలసీలు అమ్మితే కఠిన చర్యలు: భారతీ ఆక్సా 
హైదరాబాద్‌: తప్పుడు కాల్స్‌తో వినియోగదారులను తప్పుదోవ పట్టించి అనవసర ఉత్పత్తులు అంటగట్టే చర్యలకు వ్యతిరేకంగా జీవిత బీమా సంస్థ భారతీ ఆక్సా లైఫ్‌ పలు చర్యలు తీసుకుంటోంది. దేశీయ బీమా రంగానికి ఈ తరహా కాల్స్‌ పెద్ద సమస్యగా మారాయని భారతీ ఆక్సాలైఫ్‌ ఎండీ, సీఈవో వికాస్‌సేత్‌ తెలిపారు. బాధ్యతగల బీమా కంపెనీగా ఈ తరహా అనైతిక చర్యల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని, తమ విక్రయ బృందాలు కస్టమర్లకు అన్ని వివరాలు తెలియజేసి సరైన పాలసీ తీసుకునే విషయంలో అవగాహన కల్పిస్తారని చెప్పారు. 

6జీబీ, 128 జీబీల్లో నోకియా 8.1 
హైదరాబాద్‌: ఇప్పుడు నోకియా 8.1 స్మార్ట్‌ ఫోన్లు 6 బీజీ, 128 జీబీ ర్యామ్‌లల్లో కూడా మార్కెట్లోకి అందుబాటులోకి వచ్చాయి. దేశంలోని అన్ని ప్రముఖ మొబైల్‌ రిటైల్‌ స్టోర్లతో పాటూ అమెజాన్‌లో ఉంటాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ధర రూ.29,999 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement