బజాజ్‌ కేటీఎం 200డ్యూక్‌..సరికొత్తగా | Bajaj Auto launches KTM 200 Duke with ABS at 1.60 lakh   | Sakshi
Sakshi News home page

బజాజ్‌ కేటీఎం 200 డ్యూక్‌..సరికొత్తగా

Nov 26 2018 1:37 PM | Updated on Nov 26 2018 1:47 PM

Bajaj Auto launches KTM 200 Duke with ABS at 1.60 lakh   - Sakshi

ప్రముఖ ద్విచక్ర తయారీదారు బజాజ్‌ ఆటో బజాజ్‌ బైక్స్‌లో కొత్త వెర్షనను లాంచ్‌  చేసింది. బజాజ్‌ ఆటోలో 49శాతం వాటావున్న ఆస్ట్రియన్‌ బైక్‌ బ్రాండ్‌ కేటీఎంలో కొత్త బైక్‌ను విడుదల చేసింది. యాంటీ లాక్‌ బ్రేకింగ్‌ సిస్టం (ఏబీఎస్‌) ఫీచర్‌తో దీన్ని అందుబాటులో​కి తీసుకొచ్చింది. 2019, ఏప్రిల్ 1 కొత్త ఏబీఎస్‌  చట్టానికి అనుగుణంగా  ఈ మార్పులు చేపట్టింది. 

కెటిఎమ్ 200 డ్యూక్ పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త వెర్షన్‌  125 సి.సి  బైక్‌ ధర  రూ. 1.60 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) గా ఉండనుంది. కొత్తగా జోడించిన  ఏబీఎస్‌ ఫీచర్‌ మెరుగైన, నియంత్రిత  శక్తిని కలిగి ఉంటుందని కంపెనీ వెల్లడించింది. 


 
అలాగే నాన్‌ఏబీఎస్‌ కేటీఎం200డ్యూక్‌ వేరియంట్‌ కూడా రూ.1.51 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధర వద్ద అందుబాటులో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దేశవ్యాప్తంగా 450ప్రత్యేకమైన కేటీఎం దుకాణాల్లో ఈ రెండు వేరియంట్స్‌ కస్టమర్లకు అందుబాటులోఉన్నాయని బజాజ్ ఆటో  ప్రెసిడెంట్‌ అమిత్ నంది  వెల్లడించారు.  

Advertisement
 
Advertisement
Advertisement