ఏవియేషన్ లో 5/20 తొలగింపునకు సిఫార్సు? | Aviation is recommended In 5/20 elimination | Sakshi
Sakshi News home page

ఏవియేషన్ లో 5/20 తొలగింపునకు సిఫార్సు?

Mar 5 2016 1:26 AM | Updated on Sep 3 2017 7:00 PM

ఏవియేషన్ లో 5/20 తొలగింపునకు సిఫార్సు?

ఏవియేషన్ లో 5/20 తొలగింపునకు సిఫార్సు?

పౌర విమానయాన రంగానికి సంబంధించి వివాదాస్పదమైన 5/20 నిబంధనను తొలగించాలంటూ అంతర్‌మంత్రిత్వ శాఖల కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం.

న్యూఢిల్లీ: పౌర విమానయాన రంగానికి సంబంధించి వివాదాస్పదమైన 5/20 నిబంధనను తొలగించాలంటూ అంతర్‌మంత్రిత్వ శాఖల కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం.  అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ 5/20 నిబంధనను తొలగించి, అంత ర్జాతీయ సర్వీసులు నడిపేందుకు మరో ప్రాతిపదికను పరిగణించాలని ఈ కమిటీ అభిప్రాయపడినట్లు వివరించాయి. విదేశాలకు సర్వీసులు నడపాలంటే దేశీ విమానయాన సంస్థలు దేశీయంగా అయిదేళ్ల పాటు కార్యకలాపాలు నిర్వహించి, కనీసం 20 విమానాలనైనా కలిగి ఉండాలని 5/20 నిబంధన నిర్దేశిస్తోంది. టాటా సన్స్ పెట్టుబడులతో కొత్తగా ఏవియేషన్ రంగంలోకి ప్రవేశించిన విస్తార, ఎయిర్‌ఏషియా ఇండియా సంస్థలు దీన్ని ఎత్తివేయాలని కోరుతుండగా .. జెట్ ఎయిర్‌వేస్, ఇండిగో తదితర సంస్థలు నిబంధనను కొనసాగించాల్సిందేనంటున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement