‘సెడెమ్యాక్’లో నీలేకని పెట్టుబడులు.. | Auto parts startup Sedemac gets $7.5 million funding from Infosys co-founder Nandan Nilekani | Sakshi
Sakshi News home page

‘సెడెమ్యాక్’లో నీలేకని పెట్టుబడులు..

Mar 25 2016 12:29 AM | Updated on Sep 3 2017 8:29 PM

‘సెడెమ్యాక్’లో నీలేకని పెట్టుబడులు..

‘సెడెమ్యాక్’లో నీలేకని పెట్టుబడులు..

వాహన విడిభాగాల స్టార్టప్, సెడెమ్యాక్ మెక్‌ట్రానిక్స్‌లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని

ముంబై: వాహన విడిభాగాల స్టార్టప్, సెడెమ్యాక్ మెక్‌ట్రానిక్స్‌లో ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుల్లో ఒకరైన నందన్ నీలేకని  , నెక్సస్ వెంచర్ పార్ట్‌నర్స్ కలిసి 75 లక్షల డాలర్లు(50 కోట్లు) పెట్టుబడులు పెట్టారు. అందరూ ఈ కామర్స్ కంపెనీల్లో ఇన్వెస్ట్  చేస్తుండగా నిలేకని అందుకు భిన్నంగా ఈ సెడెమ్యాక్ స్టార్టప్‌కు నిధులందించారు.  వినూత్న ఐడియాలకు పెట్టుబడులందించే వ్యూహంలో భాగంగా నీలేకని, ఐఐటీ-బాంబే ల్యాబ్‌లో ఊపిరి పోసుకున్న సెడెమ్యాక్‌లో ఇన్వెస్ట్ చేశారు.  నెక్సస్ వెంచర్, ఇండియా ఇన్నోవేషన్ ఫండ్‌లు కూడా ఈ స్టార్టప్‌లో ఇప్పటికే ఇన్వెస్ట్ చేశాయి.

 సెడెమ్యాక్ సంగతి...: చిన్న ఇంజిన్లు, పవర్ ట్రైన్‌ల కోసం కంట్రోల్స్  అందించే సెడెమ్యాక్ స్టార్టప్‌ను 2008లో మెకానికల్ ఇంజనీరింగ్ ప్రొఫెసర్ శశికాంత్ సూర్యనారాయణన్ ప్రారంభించారు. జనరల్ ఎలక్ట్రిక్ కంపెనీలో కంట్రోల్ సిస్టమ్ ఇంజనీర్‌గా పనిచేసిన సూర్యనారాయణన్, ఇతర ఐఐటీయన్‌లు-పుష్కరాజ్ పన్సే, అమిత్ దీక్షిత్, మనీశ్ శర్మ్‌లతో కలసి దీనిని  నిర్వహిస్తున్నారు. టాటా మోటార్స్, మహీంద్రా గ్రూప్, అశోక్ లేలాండ్, టీవీఎస్ మోటార్స్ తదితర దిగ్గజాలు సెడెమ్యాక్ క్లయింట్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement