
న్యూఢిల్లీ: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ ఆడి తాజాగా తన కార్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఏప్రిల్ 1 నుంచి వాహన ధరలు రూ. 1 నుంచి రూ. 9 లక్షల వరకు పెరుగుతాయని పేర్కొంది. బడ్జెట్‌లోని కస్టమ్స్ సుంకం పెంపు దీనికి ప్రధాన కారణమని ఆడి ఇండియా తెలిపింది. కాగా ఆడి కంపెనీ ఎస్‌యూవీ క్యూ3 దగ్గరి నుంచి స్పోర్ట్స్ కారు ఆర్8 వరకు పలు రకాల కార్లను భారత్‌లో విక్రయిస్తోంది. వీటి ధర శ్రేణి రూ.35.35 లక్షలు–రూ.2.63 కోట్లుగా ఉంది.