ఆసుస్‌ నుంచి రెండు కొత్త ఫోన్లు

Asus Zenfone Max Pro M2 Zenfone Max M2 Launched - Sakshi

ఆసుస్‌ జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో ఎమ్‌2

ఆసుస్‌ జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ఎమ్‌2

డిసెంబర్‌ 11న ఫ్లిప్‌కార్ట్‌లో లాంచ్‌

తైవాన్‌ టెక్‌ దిగ్గజం ఆసుస్‌ డిసెంబర్‌ 11న రెండు కొత్త ఫోన్లను రిలీజ్‌ చేయనుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో మార్కెట్‌లోకి తెచ్చిన ఆసుస్‌ జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో ఎమ్‌1 కి కొనసాగింపుగా జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రో ఎమ్‌2ను నాచ్‌ డిజైన్‌తో తీసుకురానుంది. ఈ ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌ద్వారా డిసెంబర్‌ 11న మధ్యాహ్నం 12:30 గంటలకు లాంచ్‌ చేయనుంది. దీనితోపాటే సర్‌ప్రైజ్‌ లాంచ్‌గా జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ఎమ్‌2ని కూడా రిలీజ్‌ చేయనుంది.

జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ప్రొ ఎమ్‌2 ఫీచర్లు
6.3 ఇంచ్‌ల డిస్‌ప్లే
2280x1080 పిక్సల్స్ రిజల్యూషన్‌
స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
12+5 ఎంపీ  డ్యూయల్ రియర్‌ కెమెరాలు
13 ఎంపీ సెల్పీ  కెమెరా
5000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర : దాదాపు రూ.19,100

జెన్‌ఫోన్‌ మ్యాక్స్‌ ఎమ్‌2 ఫీచర్లు
6.3 ఇంచ్‌ల హెచ్‌డీ ప్లస్‌ డిస్‌ప్లే
2280x1080 పిక్సల్స్ రిజల్యూషన్‌
స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్
3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్
13+2 ఎంపీ  డ్యూయల్ రియర్‌ కెమెరాలు
8 ఎంపీ సెల్పీ  కెమెరా
4000 ఎంఏహెచ్ బ్యాటరీ
ధర : దాదాపు రూ. 13,800

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top