breaking news
asus new phones
-
ఆసుస్ నుంచి రెండు కొత్త ఫోన్లు
తైవాన్ టెక్ దిగ్గజం ఆసుస్ డిసెంబర్ 11న రెండు కొత్త ఫోన్లను రిలీజ్ చేయనుంది. ఈ సంవత్సరం ప్రారంభంలో మార్కెట్లోకి తెచ్చిన ఆసుస్ జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎమ్1 కి కొనసాగింపుగా జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రో ఎమ్2ను నాచ్ డిజైన్‌తో తీసుకురానుంది. ఈ ఫోన్‌ను ఎక్స్‌క్లూజివ్‌గా ఫ్లిప్‌కార్ట్‌ద్వారా డిసెంబర్ 11న మధ్యాహ్నం 12:30 గంటలకు లాంచ్ చేయనుంది. దీనితోపాటే సర్ప్రైజ్ లాంచ్‌గా జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎమ్2ని కూడా రిలీజ్ చేయనుంది. జెన్‌ఫోన్ మ్యాక్స్ ప్రొ ఎమ్2 ఫీచర్లు 6.3 ఇంచ్‌ల డిస్ప్లే 2280x1080 పిక్సల్స్ రిజల్యూషన్ స్నాప్ డ్రాగన్ 660 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 12+5 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాలు 13 ఎంపీ సెల్పీ కెమెరా 5000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర : దాదాపు రూ.19,100 జెన్‌ఫోన్ మ్యాక్స్ ఎమ్2 ఫీచర్లు 6.3 ఇంచ్‌ల హెచ్డీ ప్లస్ డిస్ప్లే 2280x1080 పిక్సల్స్ రిజల్యూషన్ స్నాప్ డ్రాగన్ 632 ప్రాసెసర్ 3 జీబీ ర్యామ్, 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ 13+2 ఎంపీ డ్యూయల్ రియర్ కెమెరాలు 8 ఎంపీ సెల్పీ కెమెరా 4000 ఎంఏహెచ్ బ్యాటరీ ధర : దాదాపు రూ. 13,800 -
23 మెగాపిక్సెళ్ల కెమెరాతో కొత్త ఫోన్
ఆసస్ తన జెన్‌ఫోన్ 3 సిరీస్‌లను భారతదేశంలో ఆవిష్కరించింది. టాప్ కాన్ఫిగరేషన్‌తో ఉన్న ఈ కొత్త ఫోన్ల ధరలు కాస్త ఎక్కువగానే ఉన్నాయి. జెన్‌ఫోన్ 3 డీలక్స్, జెన్‌ఫోన్ 3 అల్ట్రా, జెన్‌ఫోన్ 3 లేజర్, జెన్‌ఫోన్ 3 అనే నాలుగు మోడళ్లను ఒకేసారి ఆవిష్కరించారు. జెన్‌ఫోన్ 3, జెన్‌ఫోన్ 3 డీలక్స్, జెన్‌ఫోన్ 3 అల్ట్రా, జెన్‌ఫోన్ 3 లేజర్ ధరలు వరుసగా రూ. 21,999, రూ. 49,999, రూ. 49,999, రూ. 18,999 చొప్పున ఉన్నాయి. జెన్‌ఫోన్ 3 అన్ని ప్రధాన ఈ కామర్స్ సైట్లలో అందుబాటులో ఇప్పటికే ఉంది. మిగిలినవి వచ్చే నెల నుంచి అందుబాటులోకి వస్తాయి. జెన్‌ఫోన్ 3లో ఆండ్రాయిడ్ 6.0 మార్ష్‌మాలో ఉంది. దీనికి 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, దానికి గొరిల్లా గ్లాస్ రక్షణ ఉంటాయి. ఇందులో 2 గిగా హెర్ట్జ్ల ఆక్టా కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 3 జిబి ర్యామ్, 64 జిబి ఇంటర్నల్ స్టోరేజి ఉన్నాయి. దీన్ని మైక్రో ఎస్డీ కార్డు ద్వారా మరింత పెంచుకోవచ్చు. వెనక కెమెరా 16 మెగాపిక్సెళ్లు, డ్యూయల్ టోన్ ఎల్ఈడీ ఫ్లాష్, సెల్ఫీల కోసం 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. ఫింగర్ ప్రింట్ సెన్సర్, 4జి, ఎల్టీఈ, 3జి, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సి కనెక్టివిటీలు ఉన్నాయి. దీనికి 3000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. జెన్‌ఫోన్ 3 అల్ట్రా అయితే 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లే, ఆక్టా కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 625 ప్రాసెసర్, 4 జిబి ర్యామ్, 64 జిబి/128 జిబి ఇంటర్నల్ స్టోరేజి ఉన్నాయి. దీనికి ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన 23 మెగాపిక్సెళ్ల వెనక కెమెరా, 8 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 4జి, ఎల్టీఈ, 3జి, వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, యూఎస్బీ టైప్ సి కనెక్టివిటీలున్నాయి.