అశోక​ లేలాండ్‌ చేతికి భారీ ఆర్డర్‌ | Ashok Leyland bags order worth Rs 321 cr | Sakshi
Sakshi News home page

అశోక​ లేలాండ్‌ చేతికి భారీ ఆర్డర్‌

Mar 21 2018 12:27 PM | Updated on Mar 21 2018 6:45 PM

Ashok Leyland bags order worth Rs 321 cr - Sakshi

సాక్షి,చెన్నై: భారతదేశపు దిగ్గజ వాణిజ్య వాహన తయారీ సంస్థ అశోక్ లేలాండ్ భారీ  ఆర్డ్‌ర్‌ను తన ఖాతాలో  వేసుకుంది. తమిళనాడు రాష్ట్ర  రోడ్డు రవాణా సంస్థనుంచి ఈ ఆర్డర్‌ను సాధించింది.  బస్సుల రూపకల్పనకుగాను రూ. 321 కోట్ల విలువైన ఆర్డర్‌ను  పొందింది. తమిళనాడులో 2,100 బస్సుల సరఫరా కోసం ఈ ఆర‍్డర్‌నుసాధించామని హిందూజ గ్రూప్ ఫ్లాగ్‌షిప్ సంస్థ అశోక్ లేలాండ్ బీఎస్‌ఈ ఫైలింగ్‌లో వెల్లడించింది.  2వేల పాసింజర్‌  వాహనాలకు ఆధారమైన లోహపు చట్రాలను, పూర్తిగా నిర్మించిన 100  చిన్న బస్సులను సరఫరా చేయనున్నా మని చెప్పింది.  వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగం నాటికి సరఫరా పూర్తి చేయనున్నట్లు చెప్పారు. దీంతో అశోక్‌ లేలాండ్‌  షేర్లు 1.54 శాతం లాభాలను నమోదు చేశాయి.

Advertisement
 
Advertisement
Advertisement