చైనాలో యాపిల్ ఆర్అండ్డీ సెంటర్! | Apple focused on long-term in China | Sakshi
Sakshi News home page

చైనాలో యాపిల్ ఆర్అండ్డీ సెంటర్!

Aug 18 2016 1:40 AM | Updated on Aug 20 2018 2:55 PM

చైనాలో యాపిల్ ఆర్అండ్డీ సెంటర్! - Sakshi

చైనాలో యాపిల్ ఆర్అండ్డీ సెంటర్!

టెక్నాలజీ దిగ్గజం యాపిల్... చైనాపై అధికంగా దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగానే అక్కడ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంది.

బీజింగ్: టెక్నాలజీ దిగ్గజం యాపిల్... చైనాపై అధికంగా దృష్టి కేంద్రీకరించింది. ఇందులో భాగంగానే అక్కడ పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంది. యాపిల్ ఉత్పత్తుల విక్రయాలు చైనాలో క్షీణబాటలో ఉన్న విషయం తెలిసిందే. ఈ సమస్యను అధిగమించడానికి, చైనాలో తన ఉనికిని స్థిరంగా అలాగే ఉంచుకోవాలనే ఉద్దేశంతో యాపిల్ ఈ నిర్ణయం తీసుకుంది.

ఈ ఏడాది చివరకు చైనాలో ఒక స్వతంత్ర రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (ఆర్‌అండ్‌డీ) సెంటర్‌ను ఏర్పాటు చేస్తామని యాపిల్ సీఈవో టిమ్ కుక్ తెలిపారు. కాగా ఆసియా-పసిఫిక్ ప్రాంతంలో కంపెనీకి ఇది తొలి ఆర్‌అండ్‌డీ కేంద్రం కానుంది. కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ ప్రకారం.. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో చైనా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్ ఐదవ స్థానానికి పడింది. తొలి నాలుగు స్థానాల్లో హువావే, వివొ, ఒప్పొ, షావోమి ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement