ఈ వారంలో భారత్‌కు టిమ్ కుక్! | Apple chief Tim Cook to visit India | Sakshi
Sakshi News home page

ఈ వారంలో భారత్‌కు టిమ్ కుక్!

May 17 2016 1:42 AM | Updated on Aug 20 2018 3:07 PM

ఈ వారంలో భారత్‌కు టిమ్ కుక్! - Sakshi

ఈ వారంలో భారత్‌కు టిమ్ కుక్!

యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారత్‌లో పర్యటించే అవకాశముంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను కలిగిన...

న్యూఢిల్లీ: యాపిల్ సీఈవో టిమ్ కుక్ భారత్‌లో పర్యటించే అవకాశముంది. ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌ను కలిగిన భారత్‌లో వృద్ధి అవకాశాలను ఒడిసిపట్టుకోవాలనే ఉద్దేశంతో.. ఈయన ప్రధాని మోదీతో సమావేశమయ్యే అవకాశం ఉంది. కుక్ దేశీ టెక్నాలజీ మార్కెట్ సామర్థ్యం, భారత్‌లో తయారీ వంటి అంశాల గురించి మోదీతో చర్చించవచ్చు. అయితే యాపిల్ మాత్రం కుక్ షెడ్యూల్ గురించి ఎలాంటి ప్రకటన చేయలేదు.

కంపెనీ ఐఫోన్ విక్రయాలు తొలిసారి తగ్గిన నేపథ్యంలో.. వర్థమాన దేశాల్లో వృద్ధి కోసం కొత్త మార్గాల అన్వేషిస్తున్న సమయంలో.. కుక్ దేశీ పర్యటన ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో కుక్ మాట్లాడుతూ.. భారత్‌లో వృద్ధికి అపార అవకాశాలు ఉన్నాయని, అందుకే ఆ దేశంపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించామని చెప్పారు. కాగా చైనాలో ఐఫోన్ విక్రయాలు తగ్గితే.. మన దేశంలో మాత్రం పెరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement