ధరల నియంత్రణ పరిధిలోకి మరో 39 ఔషధాలు | Another 39 drugs under price control | Sakshi
Sakshi News home page

ధరల నియంత్రణ పరిధిలోకి మరో 39 ఔషధాలు

Jul 17 2015 12:00 AM | Updated on Sep 3 2017 5:37 AM

ధరల నియంత్రణ పరిధిలోకి మరో 39 ఔషధాలు

ధరల నియంత్రణ పరిధిలోకి మరో 39 ఔషధాలు

మధుమేహం తదితర వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మరో 39 ఔషధాలను ధరల నియంత్రణ పరిధిలోకి చేర్చినట్లు జాతీయ

న్యూఢిల్లీ : మధుమేహం తదితర వ్యాధుల చికిత్సలో ఉపయోగించే మరో 39 ఔషధాలను ధరల నియంత్రణ పరిధిలోకి చేర్చినట్లు జాతీయ ఫార్మా ధరల నిర్ణయాధికార సంస్థ (ఎన్‌పీపీఏ) ఒక నోటిఫికేషన్‌లో తెలిపింది. దీని ప్రకారం సిప్రోఫ్లోక్సాసిన్ హైడ్రోక్లోరైడ్, సెఫోటాక్సిమ్, పారాసెటమల్, డోమ్‌పెరిడోన్ తదితర ఫార్ములేషన్ల రేట్లను సవరించినట్లు పేర్కొంది. క్యాడిలా హెల్త్‌కేర్, లుపిన్, ఇప్కా ల్యాబరేటరీస్, అబాట్ ల్యాబరేటరీస్, గ్లాక్సో స్మిత్‌క్లైన్ తదితర ఫార్మా సంస్థలపై కేంద్రం నిర్ణయం ప్రతికూల ప్రభావం చూపనుంది. ఎన్‌పీపీఏ ఇప్పటికే ధరల నియంత్రణ లిస్టులో సుమారు 500 పైచిలుకు ఔషధాలను చేర్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement